బద్వేల్ ఎమ్మెల్యే ప్రమాణం

ఎప్పటిలాగే నేటి ఒక రోజు అసెంబ్లీ కూడా రుసరుసల మధ్యే ప్రారంభయింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంతో ఇది మొదలయింది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షపార్టీ ఎపుడూ వాయిదా తీర్మానం కోరుతూ ఉంటుంది. స్పీకర్ సహజంగానే తిరస్కరిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఇలాగే జరిగింది.

గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే ఇటీవల విపరీతంగా పెరుగుూ వస్తున్న పెట్రో ధరలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానాన్ని అందజేసింది.కాగా టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.

వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘సభ  సాంప్రదాయాలు నాకు తెలుసు. మీరు చెప్పినట్లు నేను సభ నడపాలా’’ అంటూ స్పీకర్ వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించారు. దేశంలో ఎక్కడా లేనంత పెట్రో భారం రాష్ట్ర ప్రజలపై ఉందని టీడీపీ నినాదాలుచేసింది. అయినా సరే స్పీకర్ వాయిదా తీర్మానాన్ని అనుమతించేది లేదని అన్నారు.

 

గురువారం 14 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దివంగతులైన 10 మంది మాజీ సభ్యులకు సభ నివాళి అర్పించనున్నారు. మహిళా సాధికారత మీద స్వల్పకాల చర్చ జరగనుంది. అయితే, ధరల మీద టిడిపి ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.

తర్వాత  ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బద్వేల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా ఎన్నికైన డాక్టర్ దాసరి సుధ చేత స్పీకర్ తమ్మినేని సీతారం ప్రమాణం చేయించారు.

సంతాప తీర్మానాలు అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. మరి కొద్దిసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *