మహారాష్ట్ర హింగోలి ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. పగలనకు,రాత్రనకు డ్యూటీ చేస్తూ వేలాది మంది గర్భినీలకు సురక్షితంగా పురుడుపోసి రికార్డు సృష్టించిన నర్స్ చనిపోయింది. విషాదమేమింటే ఆమె ప్రసవానంతరం సమస్యలతో మృతి చెందారు.
బిడ్డకు జన్మనిచ్చింది కాని, ప్రాణాలు పోయాయి. ఈ నర్సు పేరు జ్యోతి గావ్లి. హింగోలి సివిల్ ఆసుపత్రిలో ఆమె నవంబర్ 2 వ తేదీన బిడ్డకు జన్మినిచ్చారు. అయితే, అయితే, బైలేటరర్ న్యూమోనియా జబ్బుతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె ఆదివారం నాడు కన్నుమూశారు.
ఆమె గర్భవతి అయినా విధులు నిర్వహించారు. ఆమె లేబర్ రూం డ్యూటీలో ఉన్నపుడే ప్రసవం నొప్పులు వచ్చాయి. అపుడే ఆమె సెలవు తీసుకున్నారు. నవంబర్ 2న ప్రసవించారు. తర్వాత ఆమె ఇంటికి వెళ్లారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమెను నాందేడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోమని చెప్పారు. తర్వాత ఆమెకు బైలేటరల్ న్యూమోనియా వచ్చింది. దీనితో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చనిపోయారు. ఆమె విధులో ఉన్నపుడు రోజూ 15 ప్రసవాలకు అటెండయ్యేవారు. గత అయిదేళ్లకాలంలో ఆమె 5 వేలకు పైగా పురుళ్లు పోశారని డాక్టర్లు చెప్పారు.