సూర్యాపేటలో బండి యాత్రకు అటంకాలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను కలిసేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ కు తెలంగాణపోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారని పార్టీ ఆరోపిస్తున్నది. ఈ రోజు ఆయన  సూర్యాపేటలోని సంకినెని వెంకటేశ్వర రావు నివాసం నుండి రైతులను  కలిసేందుకు బయలుదేరారు.

తెలంగాణలో వరి ధాన్యం సేకరణ పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే . కేంద్రం రైతులనుంచి మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర డిమాండ్ చేస్తుంటే, రాష్ట్రం ప్రభుత్వమే కొనేందుకు ముందుకు రావడం లేదని, కేంద్రం కొనుగోలుకు అనుమతిస్తూ ఎపుడో లేఖరాసింది బిజెపి వాదిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ రైతులను కలుసుకుని ధాన్యం కొనుగోలు గురించి విచారించేందుకు పర్యటనజరుపుతున్నారు.

సూర్యాపేట లో బండి సంజయ్ కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు  ఆటంకాలు కలిగిస్తున్నాని బిజెపి విమర్శిస్తూ ఉంది.

సూర్యాపేట బస్టాండ్ వద్ద బండి సంజయ్ కుమార్ వాహనాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ మూకల యత్నించాయని,  కోడిగుడ్లు, టమాటా లతో దాడికి సిద్ధమయ్యారని బిజెపి పేర్కొంది.

ఈ ఉద్రిక్తత ల నడుమ , ఆటంకాలను లెక్క చేయకుండా బండి సంజయ్ రెండో రోజు పర్యటన కొనసాగుతూ ఉంది.

ఇది ఇలా ఉంటే,

నిన్నటి దాడి ఘటనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి సూర్యాపేటకు బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు. అయితే వారిని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని బిజెపి ఆరోపిస్తున్నది.

బండి సంజయ్ కాన్వాయ్ తో కలిసి సూర్యా పేట నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు కార్యకర్తలు బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *