ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల ఎల్లుండికి దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు.
రేపు రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురియవచ్చు. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు బీయాబీచ్చు. అందువల్ల ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలం పనులు చేసుకునే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కోరారు.