తెలుగు సినిమా మేరువు బిఎన్ రెడ్డి జయంతి నేడు

ఆరోగ్య సూత్రం: ఆదివారం పొద్దునే వేన్నీళ్లతో స్నానం చేసి, తాజా బట్టలేసుకుని, వేడి వేడి తెలుగు టిఫిన్ చేసి, టివిలో ఒక బిఎన్ రెడ్డి మూవీని ఇళ్లంతా కలసి చూడండి
తెలుగు సినిమా చరిత్రలో ’మల్లీశ్వరి ’ గురించి మాటల్లో చెప్పడం కష్టం. అద్భతం, గొప్ప చిత్రం,ఖండం, దృశ్యకావ్యం వంటి విశేషణాలు ఈచిత్రం గురించి వర్ణించేందుకు చాలవు.  ఆయన తెలుగు సినిమా స్వర్ణయుగం (1937-1968) లో పుట్టిపెరిగారు. అందుకేనేమో ఆయన చిత్రాల్ని 24 క్యారెట్ల బంగారు తునకలు.  ఆయన సమకాలీనులు ఎవరునుకుంటున్నారు, హెచ్ ఎం రెడ్డి, సిపులయ్య, పి పుల్లయ్య, వై విరావు, జి రామబ్రహ్మం వగైరాలు,
మల్లీశ్వరి  మాట వినగానే మనకు గుర్తుకొచ్చే పేరు ఒక నాటి మేటి తెలుగు సినిమా దర్శకుడు బిఎన్ రెడ్డి. తర్వాతే  ఎన్టీరామారావు, భానుమతి గురొస్తారు. బిఎన్ రెడ్డి తీసిన చిత్రాలన్నీ మర్చిపోలేనివి. ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది. తన చిత్రాల్లో ఆయన కళా సాహిత్య నిధులు పూడ్చిపెట్టారు. చూసినపుడల్లా ఒక్కొక్క నిధి దొరుకుతూ ఉంటుంది. అందుకే మళ్లీ  మళ్లీ చూడాలనిపించే చిత్రాలవి. ఆయన సినిమా గొప్పదనాన్ని తూచే తూనికరాళ్లు లేవని చెప్పాలి. ఎవరిదగ్గయినా ఉంటే గొప్పసంగతే.  నేనయితే,  బిఎన్ రెడ్డి చిత్రాలకు యోగ్యతపత్రం ఇవ్వడం కష్టం.

 

ప్రతి ఆదివారం  పొద్దనే గొరువెచ్చనీళ్లతో స్నానం చేసి, తాజాగా ఇస్త్రీ చేసిన బట్టలేసుకుని, వేడి వేడి తెలుగు టిఫిన్ చేసి,  టివి ముందు కూర్చుని యూట్యూబ్ లోనుంచో, ఒటిటి నుంచో  ఒక బిఎన్ రెడ్డి సినిమాను చూసి తరించి, మధ్యాహ్నం భోజనానికి ఉపక్రమించండి. మీకు ఆహ్లాదం లభిస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది,   ఆయుష్షు పెరుగుతుంది అని మాత్రం చెప్పగలను. మరొక విషయం,  బిఎన్ రెడ్డి సినిమాలన్నీ ఒక్కడు చూడాల్సిన సినిమాలు కాదు, చక్కగా సకుటుంబ సమేతంగా చూడదగ్గవి. కుటంబమంతా కలసి ఆనందించాల్సినవి. కుటుంబమంతా ఇలా ఒకచోట చేరి, ఆనందించడంమనేది చాలా మంచి  అలవాటు అని సోషియాలజిస్టులు చెబుతారు. పూర్వం ఇళ్లంతా పొయ్యిచుట్టూ కూర్చనే వాళ్లట. పొయిపోయింది.కిచెన్ వచ్చింది. నట్టింటో పొయ్యిప్లేస్ లోకి టివి వచ్చి చేరింది.
30 సంవత్సరాల సినిమా జీవితంలో ఆయన తీసినవి  కేవలం 11 చిత్రాలే. యేడాదికొక సినిమా తీసేందుకు ఆయన దగ్గిర అన్నివనరులు ఉన్నా మాస్ ప్రొడక్షన్ కు వెళ్లేవాడు కాదు. కథ ఎంపిక మీద ఆయన ప్రత్యేక శద్ధ చూపేవాడు.
అలాంటి చిత్రాలందించిన  బిఎన్ రెడ్ది జయంతి నేడు. ఆయన పూర్తి పేరు  బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి.  ఆయన పుట్టింది నవంబర్ 16, 1908.  మరణించింది నవంబర్ 8,1977. కడప జిల్లా కొత్త పల్లి లో జన్మించారు.  ప్రొద్దుటూరులో చదువుకున్నారు. తర్వాత ఉన్నత చదువు మద్రాసు పచ్చైయప్పకాలేజీలో పూర్తి చేశారు.  దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదట దాదాసాహెబ్ పాల్కే అవార్డు (1974) అందుకున్న చిత్రరంగ ప్రముఖుడాయనే. ఇలాగే పద్మభూషన్ అందుకున్న రెండో వ్యక్తి ఆయన.  వందేమాతరం, సుమంగళి, దేవత, స్వర్గసీమ, మళ్లీశ్వర్వి (1951), బంగారు పాప,  బాగ్య రేఖ, రాజమకుటం, పూజాఫలం, రంగులరాట్నం, బంగారు పంజరం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.  గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి, దేవత, బక్తపోతన, స్వర్గ సీమ, యోగి వేమనలకు ఆయన నిర్మాత కూడా. . ఆయన కొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే కూడా రాశారు.
ఆ రోజుల్లో సినిమాల్లోకి రావాలంటే స్టేజీ నాటకాలే బాట. నాటకాలాడటం గొప్ప హోదా. ఆ రోజుల్లో కడపజిల్లా మద్రాసు ప్రావిన్స్ లో ఉండేది కాబట్టి. దానికి తోడు ఆయన తండ్రి సంపన్న రైతు, విదేశాలకు ఉల్లిగడ్డలు ఎగుమతి చేసేవారు. అందుకే మాకం మద్రాసుకుమారింది. దీనితో   బిఎన్ రెడ్డి కుడా  మద్రాసుకు వచ్చారు. విద్యార్థి దశనుంచే నాటకాల పట్ల మక్కువ పెంచుకున్నారు.
అపుడు మద్రాసులో చెన్నపురి ఆంధ్రమహాసభ అనే సంస్థ ఉండేది. ఈ సంస్థ అక్కడి విక్టోరియా  పబ్లిక్ హాలులో  నాటకాలు వేసేది. ఈ నాటకాల మీది పిచ్చి ఆయన్నికలకత్తా తీసుకెళ్లింది. అక్కడ ఆయన బెంగాలీ నాటకాలు, సినిమాలు చూశారు. తర్వాత ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. తర్వాత గూడవల్లి రామబ్రహ్మం ప్రభావంతో సినిమా వైపు మళ్లారు. సినిమాని వ్యాపారంగా కాకుండా కళగా చూడాలనేది ఆయన నమ్మకం. అందుకే ఆయన సినిమాలు కళాఖండాలయ్యాయేమో. చాలా సార్లు ఆయన హీరోయిన్లకు గ్లిసరిన్ ఇవ్వకుండా ఏడిపించేవాడు. తెలుగు జానపద కళలంటే ఆయన ఇష్టం. ఈ టచ్ లేకుండా ఆయన సినిమాలుండవు. కావాలంటే మళ్లీశ్వరి, సుమంగళి, రాజమకుటం సినిమాలను ఒకసారి చూడండి.
ఆయన మీద హాలివుడ్ ప్రభావం కూడా బలంగా ఉండేది. ఆయన స్వర్గసీమ చిత్రం బ్లడ్ అండ్ శాండ్ (Blood and Sand) ను ప్రేరణతో తీసింది. అలాగే ’బంగారు పాప’ జార్జ్ ఇలియట్ (George Eliot) రాసిన ‘సైలాస్ మార్నర్’ అనే నవల ఆధారంగా తీసింది. సొంత స్టూడియో ఉంటేగాని పెద్ద చిత్రాలు తీయలేమని భావించి కోడంబాకమ్ లో వాహినీ స్టూడియో నిర్మాణం చేపట్టారు. దీనికి అయిదు సంవత్సరాలు పట్టింది.  ఆయన పనితనం ఎలా ఉంటుందంటే చిత్తూరు వి నాగయ్యతో కలసి తీసిన తొలిచిత్రం ‘వందేమాతం’ సూపర్ హిట్టయింది. అంతకు ముందు ఆయన స్క్రిప్టింగ్, పొడక్షన్ వర్క్ లోనే ఉండేవారు.
ఆయన తీసిన చిత్రాలన్నీ కమర్షియల్ హిట్ కాదు. ఉదాహరణకు ‘సుమంగళి’ గొప్ప ధీమ్ వైధవ్యం మీద తీసిన గొప్ప చిత్రం. అయితే, ఫెయిలయింది. అయితే, వివాహేతర సంబంధం మీద తీసిన ‘దేవత’  సూపర్ హిట్టయింది. మళ్లీ శ్వరి ఆయన కీర్తిని ఆకాశానికెత్తింది. ‘రంగులరాట్నం’ రాజకీయ వ్యంగ్యచిత్రం.  చక్కటి చిత్రం. చంద్రమోహన్  ని తెలుగు తెరకు పనిచయం  చేసిన చిత్రం. రాజమకుటం అనేది జానపద చిత్రం. బంగారు పంజరం(1968) ఆయన చివరిచిత్రం. ఆయన భావాలకు కాలం చెల్లిపోయింది. సినిమా వ్యాపరం కావడం మొదలయింది. దీనిని ఆయన గుర్తించి తప్పుకున్నారని చెబుతారు.  1977 నవంబర్ లో ఆయన చనిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *