రాజకీయ క్షేత్రం ప్రజాస్వామ్యం లో అత్యంత శక్తివంతమైన క్షేత్రం. రాజకీయాలు వద్దు అంటూ ఎంత దూరంగా పోదాం అనుకున్నా మనం చట్టాలకు లోబడే ఉండాలి. కాబట్టి మంచి సమాజ నిర్మాణం కోసం, ప్రజా జీవన అభివృద్ధి కోసం ప్రజల అందరి భాగస్వమ్యం ఎంతో అవసరం, నేటి యువత నే రేపటి తెలంగాణ నిర్మాతలు అని భావించిన “భవిష్యత్ తెలంగాణ వేదిక” తెలంగాణ యువత ను ఉద్దేశించి “తెలంగాణ మాక్ అసెంబ్లీ” ని నిర్వహిస్తోంది.
భారత రాజ్యాంగ దినోత్సవం అనగా తేదీ: 26-11-2021 నాడు భారత 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జరిగే ఒక్క రోజు మాక్ అసెంబ్లీ కీ సంబంధించిన వాల్ పోస్టర్ ను ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ దక్షిణ భారత చైర్మన్ శ్రీ పేరాల శేఖర్ రావు గారు విడుదల చేశారు. తెలంగాణ లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 119 మందిని ఎమ్మెల్యే లు గా మాక్ అసెంబ్లీ లో పాల్గొంటారు.
స్థలం: ప్రో|| జి. రాం రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
అర్హత: 18 నంవత్సరాల నుండి 38 సంవత్సరాల మధ్య వయసు గల వారు అందరు 22 నవంబర్ లోపల రిజిస్టర్ చేసుకోవచ్చు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆసక్తి కల వారు అందరూ ఆహ్వానితులే.