ఆంధ్రా మంత్రుల ఢిల్లీ యాత్రలపై అనుమానాలు

( కనకమేడల రవీంద్రకుమార్, టీడీపీ ఎంపీ) 
రాష్ట్రమంత్రులంతా ఏ యంత్రాంగంకోసం, ఎలాంటి మంత్రాంగం నడపడానికి ఢిల్లీలో తిరుగుతున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో చూర్లుపట్టుకొని వదలడంలేదు. బొత్స సత్యనారాయణ ఎందుకొచ్చారో, ఎవరిని కలవడానికి వచ్చారో తెలియదు. హోంమంత్రి సుచరిత వచ్చారు…వెళ్లారు.
మంత్రులఢిల్లీ పర్యటనపై పలుఅనుమానాలు రాష్ట్రప్రజలకు కలుగుతున్నాయి. మూడురాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో పాలనను ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా మార్చారు. చివరకు రాజధానిరైతులు పాదయాత్రచేయడానికి అనుమతి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడే పరిస్థితికి వచ్చింది. కోర్టుఅనుమతితో పాదయా త్రచేస్తున్న మహిళలు, రైతులను లాఠీలతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాదయాత్రకు ఎక్కడికక్కడ ప్రజలు మద్ధతుపలుకుతూ, వారికై వారే స్వచ్ఛందం గా యాత్రలో పాల్గొంటున్నారు.
కనకమేడల రవీంద్రకుమార్
కనకమేడల రవీంద్రకుమార్
పాదయాత్రపై కేబినెట్ మంత్రిగా ఉన్న పేర్నినాని వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమై నవి. చంద్రబాబునాయుడే పెయిడ్ ఆర్టిస్టులను రైతులముసుగులో పంపి,యాత్ర చేయిస్తున్నారని మంత్రి అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు పాదయాత్ర చేస్తే, ప్రభుత్వం ఎందుకింతలా బేంబెలెత్తుతోంది. పాలకులవెన్నులో ఎందుకు వణుకుపుడుతోంది? అమరావతిపై ప్రజల్లోఉన్న నిశ్శబ్దవిప్లవం బయటకు వస్తోంది. దాన్నిఓర్చుకోలేకనే ప్రభుత్వం రైతులపాదయాత్రను విచ్ఛిన్నం చేయడానికి కావాలనే శాంతిభద్రతల సమస్యనుసృష్టిస్తూ, ఆ నిందను రైతులపైకి నెట్టాలనిచూస్తోంది. ఒకపాదయాత్రనే నియంత్రించలేని ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతిభద్రతలను ఏం నియంత్రిస్తుందని ప్రశ్నిస్తున్నాం. రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లంటున్న మంత్రులే నిజమైన పెయిడ్ మంత్రులు. వారు ఉదయం లేచింది మొదలు ప్రజలను, ప్రతిపక్షాలను తిడుతూ, తమపబ్బం గడుపుకుంటున్నారు.
విద్యార్థులు ఎప్పుడూ రోడ్లపైకి వచ్చిన ఉదంతాలు గతకొన్నేళ్లలో ఎన్నడూ ఎక్కడా జరిగిందిలేదు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనంచేయాలంటూ, ప్రభుత్వం విద్యావ్యవస్థకే ఎసరు పెట్టే చర్యలకు దిగడంవల్లే విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులనుకాజేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాల ను గమనించే, తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని గ్రహించే, తమకు విద్యాబుద్ధులు నేర్పే సంస్థలను కాపాడుకోవడానికి, ప్రభుత్వ నిర్బంధ స్వాధీనాన్ని నిరసిస్తూ రోడ్లెక్కారు. రైతులు పాదయాత్రతోపాటు, విద్యార్థుల నిరనలను కూడా ప్రభుత్వం భరించలేకపోయింది. ముక్కుపచ్చలారని విద్యార్థుల పై కూడా లాఠీలు ఝళిపించేలా చేసింది. విద్యార్థులను అనునయించి, నియంత్రిం చలేని ప్రభుత్వ, పోలీసుల వైఫల్యం శాంతిభద్రతల వైఫల్యం కాదా? ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనంచేసుకుంటామంటూ సమస్యలు సృష్టించింది ప్రభుత్వమే. తిరిగి ఆ సమస్యపరిష్కారంకోసం రోడ్డెక్కిన విద్యార్థులను దారుణంగా హింసించిందీ ఈ ప్రభుత్వమే. ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వెనక్కుతగ్గిన ప్రభుత్వం చివరకు ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనంలో స్వచ్ఛందమేకానీ నిర్బంధంలేదంటూ జీవోఇచ్చింది. ఎందుకింత పాలనా వైఫల్యం.. అనుభవరాహిత్యమా..లేక అహంకారమా? రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తే, అహంకారంతో కూడిన అనుభవరాహిత్యానికి తోడు, ఫ్యాక్షనిజానికి తోడైన అధికారం కనిపిస్తోంది. వాటన్నింటి ఫలితమే రాష్ట్రంలో సాగుతున్న అరా చకం, ప్రజలపై సాగుతున్న విధ్వంసం, అంతిమంగా రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం.
ఇవన్నీచూస్తుంటే పాలనలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా వైఫల్యంచెందినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సమస్యలను సృష్టిస్తున్నవారే వాటిని పరిష్కరించలేక వైఫల్యం చెందుతూ, అంతిమంగా వాటిని ప్రజలనెత్తినరుద్దుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రతిపక్షం విఘాతంకలిగిస్తోందంటున్నారు.
రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.25వేలకోట్ల విద్యుత్ బకాయిలను విద్యుత్ డిస్కంల కు చెల్లించాల్సి ఉంది. ట్రూఅప్ ఛార్జీలు, ఆఛార్జీలు..ఈఛార్జీలంటూ ఏపీఈఆర్ సీ ని అడ్డుపెట్టుకొని, దాన్నితమస్వార్థానికి వాడుకుంటూ, ఒకస్వతంత్రసంస్థను నిర్వీర్యంచేస్తోన్న ప్రభుత్వందానితోనాట్యం చేయిస్తోంది. ప్రభుత్వశాఖల తాలూకా బకాయిలు డిస్కంలకుచెల్లించకపోతే, పరిస్థితి చాలా దారుణంగా తయా రవుతుందని నిపుణులుకూడా అంటున్నారు. మా పార్టీ నాయకులు పయ్యావు ల కేశవ్ గారు ఏపీఈఆర్సీని నిలదీస్తే తప్ప, ఆ సంస్థ ప్రభుత్వానికి నోటీసు లివ్వని దుస్థితి. ప్రజలకు నిజాలు తెలియకుండా స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థను ప్రభుత్వం గుప్పిట్లోదాచి, దానితోపనిచేయిస్తోంది. ప్రభుత్వశాఖల బకాయిలను కూడా ప్రజలనుంచి వసూలుచేసి, ఈఆర్సీకి చెల్లించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను మాపార్టీనేతలే బయటపెట్టారు.
ఏపీ ఎంఐడీ వారు రాష్ట్రానికిఎలాంటి వైద్యపరికరాలు పంపిణీచేయవద్దని తయారీ సంస్థలకు తాఖీదులుపంపాయి. ఆ సంస్థకు రూ.15వేలకు పైగా ఏపీప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా నాలుగేళ్లనుంచి పెండింగ్ పెట్టింది. వైద్యపరికరాలు, సామగ్రి రాకపోతే, రాష్ట్రవైద్యరంగం పూర్తిగా నిర్వీర్యంకావడం ఖాయం. కేంద్రప్రభుత్వం వద్ద ఇప్పటికే రాష్ట్రపరిస్థితి బజారులో ఉంది. జాతీయ, అంతర్జాతీ యస్థాయిలో రాష్ట్రపరువుపూర్తిగా పోయింది.
ఏపీసీఎం ఢిల్లీలో అడుక్కుంటున్నారని తెలంగాణ మంత్రి అంటుంటే, ఏపీ మంత్రులు ప్రజలు గుండెలపై చెయ్యేసేలా సమాధానం చెప్పలేకపోతున్నారు. మా రాష్ట్రపరిస్థితి చాలాబాగుంది, మేం అప్పులకోసం వెళ్లలేదని మంత్రి పేర్నినానీ ఎందుకు చెప్పలేకపోయారు? ఆరోపణలకు సమాధానం తిట్లుకాదనే వాస్తవాన్ని ఏపీ మంత్రులు ఎందుకు గుర్తించడంలేదు? తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు ఇదివరకు చేసిన ప్రకటనలు రాష్ట్రమంత్రులకు గుర్తులేవా?
గ్రామాల్లో ఎక్కడైనా ఒకవ్యక్తి దివాళాతీస్తే, అతను ఐపీ పెట్టాడని పరిహాసంగా చెప్పుకుంటారు. అంతకంటే దారుణమైన మాటల్ని ఢిల్లీలో ఏపీగురించి వింటున్నాం. మరీముఖ్యంగా ఏపీ మంత్రులమాటలు దిగజారుడుతనంగా ఉంటు న్నాయి. ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం తప్ప, మంత్రులకు మరోపని లేదు.
స్థానికసంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించేస్థితిలో ఏపీప్రభుత్వం లేదు. ప్రతిదానికి కోర్టులకు వెళితే తప్ప ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ దొరకడం లేదు. కొందరు అధికారులు, పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి, అధికారపార్టీ నేతలకు తొత్తుల్లామారి రాష్ట్రప్రతిష్ట పూర్తిగామసకబారేలా చేస్తున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా, నిర్బంధంగా ఎన్నికలు జరిపాలన్న ప్రభుత్వధోరణి చూస్తుంటే, పాలకులు ఎంతలా బేంబెలెత్తిపోతున్నారో అర్థమవుతోంది.
ఉద్యోగాలిచ్చే పరిస్థితిలో ఏపీప్రభుత్వం లేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం అనేది మిథ్యగానే మిగిలిపోయింది. ఉద్యోగసంఘాలనేతలు ప్రెస్ మీట్లలో ఉండగా నే సలహాదారులు బెదిరించేస్థాయికి చేరారు. పీఆర్సీ నివేదికను కూడా బహిర్గతం చేయలేని ప్రభుత్వంపై ఉద్యోగులు పోరాడాల్సిన సమయం వచ్చింది.
రాష్ట్రంలో ప్రజలకు, వారి ఆస్తులకు, మహిళల మానప్రాణాలకు రక్షణే లేకుండా పోయింది.
రాష్ట్ర రుణపరిమితి పెంచాలంటూ బుగ్గన ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే, పరిమితికి మించి అప్పులుచేశారంటూ, కేంద్రప్రభుత్వం ఏపీకి అప్పులుచేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. రెవెన్యూలోటు అనేది ఎప్పుడూలేనివిధంగా రూ.35,500కోట్లకు చేరి, 662శాతం పెరిగిందని ఎకనమిక్ టైమ్స్ లో రాశారు. ఎన్నడూలేనివిధంగా రాష్ట్రానికి ఆదాయం పెరిగినాకూడా ఆర్థికలోటు పెరగడమేంటి? తెస్తున్న అప్పు లు, ప్రజలనుంచి వివిధరూపాల్లో వసూలుచేస్తున్నసొమ్ముపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ప్రజలను కూడా మభ్యపెడుతూ, వాస్తవాలు దాస్తున్నారు. అస మర్థ ఆర్థికవిధానాలతో రాష్ట్రపాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనంచేశారని కేంద్రప్రభుత్వసంస్థలు చెబుతున్నాయి. ఆఖరికి రూ.250కోట్ల కోసం ఆరోగ్య విశ్వ విద్యాలయం మేనేజ్ మెంట్ ను బెదిరించేస్థాయికి ప్రభుత్వం వెళ్లింది.
జగన్మోహన్ రెడ్డి నియంత్రత్వపోకడలు అసమర్థపాలనే రాష్ట్రానికి శాపంగా మారాయి. కేసులమాఫీకోసం కేంద్రానికి ఏమేం తాకట్టుపెడదామన్నఆలోచనలో నే పాలకులుఉన్నారు. ఏం తాకట్టుపెట్టి అప్పులు తీసుకురావాలి… ఏఏసంస్థల నిధులు లాక్కోవాలి.. ఎవరెవరికి బకాయిలు ఎగ్గొడదామా ఇవేఆలోచనల్లో ఉన్నారు. చివరకు ఉద్యోగులు సకాలంలో మాకు జీతాలు అందడంలేదని రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది. అప్పులతెస్తూ, ప్రజలనుంచి చేస్తున్న వసూళ్లన్నీ ప్రభుత్వం ఏంచేస్తోంది? సంక్షేమం పేరుతో ప్రచారానికి వాడుకుంటూ, వీలైనంతవరకు ఎక్కడికక్కడే ఖజానాకు చేరాల్సిన సొమ్ముని దారిమళ్లిస్తున్నారు. ఏదో చేస్తున్న ట్టు ప్రచారానికి కొన్నివేలకోట్లు తగలేస్తూ, సంక్షేమం ముసుగులో సంక్షోభం సృష్టి స్తున్నారు. కొత్త స్కీమ్ పెట్టడం, దానిముసుగులో స్కామ్ లు చేయడం. అంతిమంగా రాష్ట్రపరువుని వీధుల్లోపెట్టారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన మంత్రులేమో బూతులు తిడుతూనే, తమను తిడుతున్నారంటూ రాష్ట్రపతికి ని వేదికలుఇస్తారు. వ్యక్తిగతంగాతిడుతూ, అసలుఅంశాలను దారిమళ్లిస్తూ, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ఎన్నాళ్లు తప్పించుకుంటారు?
(ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన టీడీపీఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రెస్ మీట్ వివరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *