అమరావతి రాజధాని పరిరక్షణ కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానానికి అంటూ రైతులు,ప్రజాసంఘాలు చేపట్టిన మహాపాదయాత్ర జోరుగా సాగుతూ ఉంది. యాత్రలో పాల్గొంటున్న వారిలో ఉత్సాహం సన్నగిల్లలేదు. యాత్రకు మంచి ప్రచారం లభిస్తూ ఉంది. ప్రశాంతంగా సాగుతున్న యాత్రికుల మీద నియమాలు ఉల్లంఘించారని అడదడపా ఆంధ్రా పోలీసులు పెట్టే కేసులతో ఈయాత్రకుఇంకా పబ్లిషిటీ వస్తూ ఉంది. ఇంతవరకు అమరావతి ప్రాంతంలలో గుడారాలు వేసుకుని చేస్తూ వచ్చిన ఉద్యమాన్ని ఇతర ప్రాంతాల వాళ్లెవరూ ప్రత్యక్షంగా చూల్లేదు. అంతా పేపర్లో వచ్చిన వార్తలనేగ గమనించే వారు. కొన్ని పత్రికలు ఈ ఉద్యమాన్ని ఆకాశానికెత్తితే, మరికొన్ని కించపరుస్తూ వచ్చేవి. అయితే, వాస్తవేవిమిటో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఇపుడు మంచికో చెడుకో, అమరావతి ఉద్యమకారులు ఇపుడు ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని పరిచయం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. న్యాయస్థానం నుంచిదేవస్థానానికి అనే నినాదంతో ఈ యాత్ర ఇపుడు ప్రజల దగ్గరకు వెళుతూ ఉంది. ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద పాదయాత్రకు విరామం పలికారు. శనివారం అక్కడే బస చేసి ఆదివారం ఉదయం పాదయాత్ర మొదలుపెడతారు. దీనితో ప్రకాశం జిల్లాలో 12వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగిసినట్లే. ముక్తినూతలపాడు నుంచి పాదయాత్ర ప్రారంభమైన పాదయాత్ర యరజర్ల శివారు దాకా సాగింది. ఒంగోలులో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న బృందావన్ ఫంక్షన్ హాల్ నుంచి.. మంగమ్మ కళాశాల సెంటర్ జంక్షన్ వరకూ శుక్రవారం పాదయాత్ర సాగింది.ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, బీసీ సంఘాలు, హైదరాబాద్లోని ఏపీ వాసులు సంఘీభావం తెలిపాయి.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి సమదూరం ఉంటుందని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని పాదయాత్రలో పాల్గొన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పాదయాత్ర పోలీసుల పహారా నడుమ కొనసాగుతున్నది. అభిమానులు అమరావతి రైతులకు స్వాగతం ఏర్పాట్లు బాగా జరిగాయి. సేవ్ అమరావతి, ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు.
డప్పు శబ్దాలు, కోలాటనృత్యాలమధ్య పాదయాత్ర లో బాగా సందడి సృష్టిస్తున్నారు.