నేడు TRS రాష్ట్ర వ్యాపిత వరి పోరు

 తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర బిజెపి సర్కార్ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, టీఆరెస్ పార్టీలు ఆందోళనకు పిలుపు నిచ్చాయి. విచిత్రమేమంటే కేసీఆర్ రద్దు చేసిన ధర్నా చౌక్ ఇపుడు ఈ ఆందోళనకు వేదిక అవుతున్నది. 2014 లో కేసీఆర్ ముఖ్య మంత్రి అయ్యాక ఇక ఉద్యమాలు అవసరం లేదని రాజధాని లోని ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ ను రద్దు చేసారు. తర్వాత ప్రతిపక్షాలు కోర్ట్ కు వెళ్లి ధర్న చౌక్ ను  పునరుద్ధరించుకున్నాయి. ఇదే ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టిఆర్ఎస్ నేతలు  ధర్నా చేసి, నినాదాలు ఇచ్చి మోడీ  ని విమర్శిస్తాయి.
పంజాబ్ హర్యానాలలో పూర్తి వరి ధాన్యం కొంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లో ఎందుకు కోనడం లేదని ప్రశ్నిస్తు టిఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాపిత ఆందోళనకు దిగారు.
రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో  గులాబీ సైన్యం ధర్నాలు, నిరసనలు జరుగుతాయి.
ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన పార్టీ చేసింది.
మూడు లక్షల మంది గులాబీ సైన్యం రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొంటారని టీ ఆర్ ఎస్ వర్గాలు తెలిపాయి.
నిన్న బిజెపి ఇదే సమస్య పై ఆందోళన నిర్వహించింది. కాకపోతే సీఎం కేసీఆర్ మీద ఆందోళన గురిపెడితే టీఆరెస్ మోదీ మీద ఎక్కుపెట్టింది.
నిరసన సక్సెస్ అయ్యేలా  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లాన్ వేశారు.
హైదరాబాదులో లో ఇందిరా పార్క్ వద్ద జంటనగరాల టిఆర్ఎస్ నేతల ఉమ్మడి ధర్నా.
 సిరిసిల్లలో కేటీఆర్ సిద్ధిపేటలో హరీష్ రావు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 జిల్లా ప్రధాన కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు కార్యకర్తలు, నాయకులు రైతుల ధర్నాలో పాల్గొంటారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి ధర్నాలకు అనుమతి తీసుకున్నరు.
ధాన్యం కొనుగోలు పై కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిరసనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *