త్వరలో రైతు బైక్ ర్యాలీ, జీప్ జాతాలు

*రైతుఉద్యమంలో భాగంగా నవంబర్ 26న కళా ప్రదర్శన – నిరసన దీక్ష
*21 నుండి 24 వరకు రాష్ట్ర వ్యాపితంగా బైక్ ర్యాలీ,జీపు జాతాలు.
రైతు సంఘాల సమన్వయ సమితి, ప్రజా సంఘాల సంయుక్త సమావేశం శుక్రవారం విజయవాడనగరంలోని స్థానిక మాకినేని బసవవున్నయ్య విజ్ఞాన భవనంలో సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగింది. గత ఏడాది కాలంగా డిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంతో పాటు వారికి సంఘీభావంగా దేశ వ్యాపితంగా జరుగుతున్న ఆందోళన నిర్వహించాలని పిలుపు నిచ్చారు.. ఈ నెల 26 నాటికి రైతు ఉద్యమం ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసిన తీర్మానాలు వివరాలను వెల్లడించారు. ఈ నెల 26 న విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద నుండి ధర్నా చౌక్ వరకు కళారూపాలతో ప్రదర్శన నిర్వహించి ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసనదీక్ష జరపాలని అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసన ఆందోళనలు నిర్వహించాలని వివరించారు.
అలాగే ఈ నెల 21 నుండి 24 వరకు అన్ని జిల్లాల్లో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కలిపి బైక్ ర్యాలీలు, జాతాలు జరపాలని తెలిపారు. ఉదయం జరిగిన సమావేశంలో వడ్డే ప్రసంగిస్తూ మోడీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం మాదిరిగా వ్యవహరిస్తూ ఉందని, రైతులు, కార్మికులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు అనేక ఎత్తుగడలు, కుట్రలు చేసినప్పటికీ వెనుకడుగు వేయకుండా మోగ్గవోని దీక్షతో సాగుతుందని, ఈ ఉద్యమాన్ని దేశవ్యాపితంగా గ్రామ గ్రామాన విస్తరించాలని అన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, ఏపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యెలినేని కేశవరావు,సాగునీటి వినియోగదారుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి రైతులకు గిట్టుబాటు ధర , కనీస మద్దతు ధర, నకిలీ విత్తనాలు పురుగుమందులు సమస్యలు పట్టించుకోకుండా కార్పొరేట్ వ్యవసాయానికి వూతం ఇస్తున్నారని అన్నారు.
యుపిలో ప్రశాంతంగా సాగుతున్న రైతు ఉద్యమం మీద వాహనంతో ఢీ కొట్టి రైతుల హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ ఐ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఓబులేసు, సి ఐ టి యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. ఉమామహేశ్వరరావు, ఏపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జల్లి విల్సన్, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ వలేటి కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి కోరుతూ సాగుతున్న రైతుల యాత్రపై పోలీసుల లాఠీఛార్జి జరపడం దారుణ ఘటన అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని త్వరలో జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రైతుల నల్ల చట్టాల రద్దు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో , చుండూరు రంగరావు, నాదెళ్ల బ్రహ్మయ్య, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సింహాద్రి ఝాన్సి, దడాల సుబ్బారావు, ఆవుల శేఖర్, వి. హనుమారెడ్డి, పి శ్రీనివాస్,జే. మురళీధర్, మోతుకూరి అరుణకుమార్, ఎ. రవిచంద్ర, ఎమ్. రామకృష్ణ,చల్లపల్లి విజయ, ఎమ్. వి. ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *