“శాంతియుతంగా సాగుతున్న అమరావతి మహిళల రైతుల మహాపాదయాత్రపై జగన్ రెడ్డి ప్రభుత్వం కవ్వింపు చర్యలు మానుకోవాలి”
(అచ్చెన్నాయుడు)
నమ్మకద్రోహానికి వ్యతిరేకంగా భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్న రైతులపై పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులను పోలీసులు అడుగడుగున అడ్డుకోవడం సరైనది పద్దతి కాదు. రైతులు ఏమైనా తీవ్రవాదులా? 6 రోజుల నుండి శాంతియుతంగా జరుగుతున్నది. పాదయాత్రకు స్వాగతం చెప్పేందుకు వస్తున్న పల్లె ప్రజలను అడ్డుకోవడం సరైంది కాదు. పోలీసుల దుందుడు చర్యలతో ఒకసారి వారికి సంకెళ్లు వేసి కోర్టుల చేత తిట్లు తిన్నారు. కోర్టు అనుమతితో, న్యాయసస్థానం పర్యవేక్షణలో జరుగుతున్న పాదయాత్రపైనే పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రజలకు ఈ రాష్ట్రంలో నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును ఉల్లంఘించడం కాదా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా? న్యాయాన్ని, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కవ్వింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. పోలీసుల చర్యలపై విచారణ చేపట్టి రైతులపై అత్యుత్సాహంతో ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. 3648 కి.మీ పాదయాత్ర చేసానని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి రైతుల పాదయాత్రపై పోలీసులను రెచ్చగొట్టడం నీతిమాలిన చర్య. నాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ప్రవర్తించి ఉంటే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగే వాడా? రైతుల మహాపాదయాత్రలో జరగరాని సంఘటనలు జరిగితే దానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది.