వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రజాప్రస్థానం నేడు 100 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్నది. ఒక వైపు దూసుకువస్తున్న బిజెపి , మరొక వైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో తీసుకువచ్చిన నూతనోత్సాహం.మరొక వైపు రూలింగ్ టిఆర్ ఎస్ సందడి అంతా ఇంతా కాదు. తెలంగాణ రాజకీయాలు ఇంతసందడిగా ఉన్నా షర్మిల పాదయాత్ర తెలంగాణ లో ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇన్ని పార్టీలున్నా ఆమె లో నెగ్గురాగలగమా లేదా అనే ప్రశ్నార్థకం గాని, నిరుత్సాహం గాని కనిపించవు.
9వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం 9.30 నిమిషాలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడు గ్రామం నుంచి ప్రారంభంకానుంది. అక్కడి నుంచి ఉదయం 10.00 గంటలకు కప్పాపహాడ్ గ్రామంలో YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 నిమిషాలకు తుర్కగూడ గ్రామం వద్దకు పాదయాత్ర చేరుకుంటారు. ఉదయం 11.30 నిమిషాలకు చెర్లపటేల్ గూడ గ్రామం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. చెర్లపటేల్ గూడ గ్రామంలో మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 3.00 గంటల వరకు భోజనం విరామం ఉంటుంది. మధ్యాహ్నం 3.00 గంటలకు చెర్లపటేల్ గూడ గ్రామం నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఇబ్రహీంపట్నం క్రాస్ వద్ద 100కిలోమీటర్ల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర పూర్తి చేసుకుంటుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సాయంత్రం 4.30 నిమిషాలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. పాదయాత్ర 100కిలోమీటర్లు ముగిసిన సందర్భంగా ప్రజలనుద్ధేశించి YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మాట్లాడతారు.