27-10-2021. రాత్రి 07-00 గంటల సమయానికి ఎన్నికల ప్రచారం గడువు ముగిసినందున కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం స్థానికేతర వ్యక్తులు నియోజకవర్గంలో తిరగరాదని నిషేధం విధించారు. ఇలాంటి వ్యక్తులు నియోజక వర్గం ను వదిలి వెళ్ళిపోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ ప్రకటన చేశారు. లేనిచో కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
నేటి రాత్రి 07-00 నుంచి ఎన్నికలు ముగిసే వరకు గల 72 గంటలు కాలాన్ని నిశ్శబ్ద కాలంగా కేంద్ర ఎన్నికల సంఘం విధించిందని, (2) Addl DCsP, (15) ACsP, (65) CI , (180) SI మరియు 2000 మంది సిబ్బంది, 22 కంపెనీల కేంద్ర , రాష్ట్ర సాయుధ బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
కమిషనర్ వెల్లడించిన విషయాలు
28.9.2021 రోజున కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఎలక్షన్ కు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోనికి వచ్చింది. కరీంనగర్ కమిషనరేట్ , వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 MCC , 10 VST లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నాము. ఎన్నికల షెడ్యూలు అమలుకాలంలో చేసిన తనిఖీల్లో భాగంగా, ఇప్పటివరకు వేర్వేరు సందర్భాలలో ₹ 3,29,36,830 /- రూపాయలను,₹ 6,36,052, రూపాయలు విలువగల 944 లీటర్ల మద్యమును, ₹ 69,750 రూపాయల విలువగల 11.4 కేజి లు గంజాయిని, ₹44,040 రూపాయలు విలువగల పేలుడు పదార్థాలను, ₹ 2,21,000 విలువగల చీరలు మరియు చొక్కాలను మరియు ₹ 10,60,000 రూపాయలు విలువగల, బంగారం మరియు వెండి ఆభరణాలను వీటి అన్నింటి విలువ ₹3,49,63,679 రూపాయలు గల వాటిని స్వాధీనపరచుకొని చర్యలు తీసుకొనబడ్డాయి.
ఇప్పటి వరకు అల్లరి సృష్టించే 2,284 మంది వ్యక్తులను గుర్తించి తహశీల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగింది. బైండోవర్ నియమావళి ఉల్లంఘించి మళ్ళీ నేరానికి పాల్పడిన ఎల్కపల్లి సంపత్ అనే వ్యక్తిని ఉల్లంఘన నేరం క్రింద అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది.
ఇప్పటి వరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘన క్రింద వివిధ పార్టీల పై 116 కేసులు నమోదు చెయ్యడం జరిగింది.