ఫిరాయింపుల్లో TRSకు జాతీయ గుర్తింపు

దేశంలో ఒక కొత్త పార్టీ అయినా, కొత్త రాష్ట్రం నుంచి వచ్చినా, దేశంలో కొనసాగుతున్న రాజకీయ ఫిరాయింపు (Political defections) నుంచి బాగా లబ్ది  పొందిన మూడో  పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS). ఈ విషయంలో ఈ పార్టీకి జాతీయ హోదా లభించింది. ఎందుకంటే, ఫిరాయింపుదారుల మొదటి గమ్యస్థానం బిజెపి అయితే రెండోది కాంగ్రెస్ పార్టీ.  ఈ రెండు జాతీయపార్టీలు. తెలంగాణ ప్రాంతీయ పార్టీఅయినా టిఆర్ ఎస్ కు కూడా ఈ హోదా లభించడం విశేషం. ఫిరాయింపులకు సంబంధించి టిఆర్ఎస్ మూడో పెద్ద లబ్దిదారు అని రెండు జాతీయ సంస్థల విశ్లేషణలో తేలింది.బిజెపి, కాంగ్రెస్ ల తర్వాత ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు దూకిన పార్టీ ఇదే.

పార్టీ ఫిరాయింపులకు కారణం విలువల రాజకీయాలు లేకపోవడమేనని ఎడిఆర్ తన నివేదికలో పేర్కొంది. ధనదాహం, పదవీ కాంక్ష, ధనబలానికి జనబలానికి లంకె ఉండటంతో పాటు, రాజకీయ పార్టీలకు సమర్థవంతమయిన,  నిజాయితీతో కూడిన, విశ్వసనీయ నాయకులు లేకపోవడమే కారణమని  ఈసంస్థ పేర్కొంది.

గత అయిదు  సంవత్సరాలలో పార్టీ ఫిరాయింపులతో మాగ్జిమమ్  లాభపడింది. భారతీయ జనతా  పార్టీ. మొత్తం 405  మంది ప్రజాప్రతినిధులు  ఈ మధ్య కాలంలో పార్టీలు ఫిరాయిస్తే  182 మందికి గమ్యస్థానం బిజెపియే. ఇక ఎక్కువ మందిప్రజా ప్రతినిధులనుపొగొట్టుకున్న పార్టీ  సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ. ఈపార్టీ  2016-2020 మధ్య మొత్తంగా 170 మందిని కోల్పోయింది.

మొత్తం పిరాయింపుదారుల్లో  44.9 శాతంమంది బిజెపిలోకి దూకారు. వీళ్లంతా   2016-2020 మద్య  బిజెపి టికెట్ మీద ఎన్నికల్లో పోటీ చేశారు. దేశంలోని ఫిరాయింపులను విశ్లేషించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (Association for  Democratic Rights), నేషనల్ ఎలెక్షన్ వాచ్ (National Election Watch) లు ఒక నివేదిక విడుదల చేసింది. ఈ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫడివిట్ల అధారంగా  ఈ విశ్లేషణ జరిపారు. తమాషా ఏమిటంటే,  ఇటీవలి కాలంలో  మధ్యప్రదేశ్, మణిపూర్,గోవా, అరుణాచల్ ప్రదేశ్ లలో  ప్రభుత్వాలు కూలిపోయింది పిరాయింపులదారుల వల్లే.

కాంగ్రెస్  పార్టీలో చేరిన ఫిరాయింపు దారులు కేవలం38 మంది(9.4 శాతం) మాత్రమే. ఇక మూడో స్థానంలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ పార్టీలోకి  ఈ మధ్య కాలంలో 25 మంది ఫిరాయింపుదారులు వచ్చి చేరారు.

*170(42%) MLAs left INC to join another party during the elections held between 2016-2020. While only 18 (4.4%) MLAs left BJP to join a different party to contest elections during this period.

*Between 2016-2020, 182 (44.9%) out of 405 re-contesting MLAs who switched political parties joined the BJP followed by 38 (9.4%) MLAs who joined INC and 25 (6.2%) MLAs who joined TRS.

* 5(41.7%) Lok Sabha MPs left BJP to join another party during the Lok Sabha elections 2019. While 7 (43.8%) Rajya Sabha MPs left INC to join a different party to contest elections during the elections held between 2016-2020.

* Between 2016-2020, 10 (62.5%) out of 16 recontesting Rajya Sabha MPs who switched political parties joined the BJP, and 5 (41.7%) out of 12 Lok Sabha MPs who changed parties joined INC in the Lok Sabha Election 2019.

* It is to be noted that the recent fall of governments in Madhya Pradesh, Manipur, Goa, Arunachal Pradesh, and Karnataka State Assemblies were due to defections of their MLAs.

ఇక ప్రజాప్రతినిధులను పొగొట్టుకున్న పార్టీల విషయానికి వస్తే,   కాంగ్రెస్ పార్టీ  170 మందిని (42శాతం) మందిని కోల్పోయింది. బిజెపికి కోల్పోయింది కేవలం 18 మందినే(4.4 శాతం).  మిగత పార్టీల విషయానికి వస్తే బిఎస్ పి 17 మందిని (4.2 శాతం), తెలుగుదేశం పార్టీ 17  మందిని (4.2 శాతం), ఎన్ పిఎఫ్  15 మందిని (3.7శాతం), వైఎస్ ఆర్ కాంగ్రెస్  15 మందిని (3.7 శాతం), ఎన్ సిపి 14 మందిని (3.5శాతం), సమాజ్ వాది పార్టీ  12 మందిని(3శాతం) కోల్పోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *