రేవంత్ చెప్పిన షాకింగ్ విషయాలు

హూజూరాబాద్ ఎన్నికల క్యాంపెయిన్ లో మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు నాలుగు ఆసక్తికరమయిన విషయాలు బయటపెట్టారు. రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిలతో కలసి కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడారు.

1.కెసిఆర్ ,ఈటెల ఎందుకు విడిపోయారు 2) GDPని పెంచుతానని మోదీ అనడంలో అర్థమేంటి?  3) దళితబంద్ ను సిద్ధిపేటలో హరీష్ రావు ఇప్పించొచ్చు కదా 4) డిజిపి ఫోన్ టాప్ అవుతూ ఉంది అని రేవంత్ చెప్పారు.

ఇవే రేవంత్ కామెంట్స్

వ్యాపార పంపకాల తేడాతోనే తెరాసలో అభిప్రాయాల భేదాలు వచ్చాయి. ఒక వ్యాపార సంస్థను కేసీఆర్, ఈటెల పాలించారు. కేసీఆర్ ఎండీ అయితే ఈటెల డైరెక్టర్. ఎండి, డైరెక్టర్  మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి ఈటెలను బయటకు పంపారు. దాంతోనే ఈ ఉప ఎన్నికలు.

ఫీజ్ రీఅంబర్స్ మెంట్, దళిత బంధు, గిరిజన బంధు, రెండు పడకల ఇళ్ల కోసమో, ఉద్యోగాల కోసమో, ఎస్సి వర్గీకరణ కోసమో, రుణమాఫీ కోసమో ఈటల పోరాటం చేసి రాజీనామా చేయలేదు.

గత ఐదు నెలల నుంచి స్థానిక సమస్యల పై, అభివృద్ధి, సంక్షేమం పైన చర్చ జరగలేదు. పొద్దున కొన్న వాళ్ళను సాయంత్రం మళ్ళి కనుక్కొనే దౌర్భాగ్యం, సొంత పార్టీ కార్యకర్తలనే కట్నం ఇచ్చి తిప్పుకోవల్సిన దుస్థితి ఇక్కడ వచ్చింది. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేయడం పాత సీసాలో కొత్తసారా లాంటిది. తెరాస గెల్లు శ్రీనివాస్, చిల్లు శ్రీనివాస్ సీసా పాతదే సారా పాతదే

కాంగ్రెస్ అభ్యర్థి గురించి మీకు తెలుసు.. అభ్యర్థి పేరు ప్రకటించడంలో  ఆలస్యం అయ్యింది. నిజమే.  పాత పెళ్లికొడుకు  మనోడే అనుకుంటే కోవర్టు ఆపరేషన్లో వెళ్ళిపోయాడు, అపుడేం చేయాలి. కొత్త వాన్ని వెతుక్కున్నాం. గట్టి వాణ్ణి వెతికాం

అభ్యర్థులు లోకల్ నాన్ లోకల్ అంటున్నారు. సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేట నుంచి పోటీ చేసిన వాళ్ళు స్థానికులా… హరిశ్ రావ్, కేసీఆర్, కెటిఆర్ లు వాళ్ళు ఆయా నియోజక వర్గాలలో లోకల్ వాళ్ళా..

నరేంద్ర మోడీ GDP

ఆనాడు ప్రధాని నరేంద్రమోదీ జీడీపీ పెంచుతానంటే ఏమో అనుకున్నాం. నిజమే అనుకున్నాం.  కానీ జిడిపి పెంచుతాం అంటే పెట్రోల్ గ్యాస్, డీజిల్ ధరలు పెంచుతాడని అనుకోలేదు. మోదీ దృష్టిలో జిడిపి (GDP) గ్యాస్ (G), డీజిల్ (D),పెట్రోలు(P).ఈ జిడిపి రోజూ పెరుగుతూ ఉంది.

40 రూపాయలకు లీటర్ అమ్మాల్సిన పెట్రోల్ 110 రూపాయలకు అమ్ముతున్నారు.  గ్యాస్ ధరలు 450 నుంచి 1000 రూపాయలు పెంచినందుకు బీజేపీ కి ఓటేయలా.

సిద్ధిపేటలో దళిత బంధు ఎందుకివ్వలే?

దొంగ నుంచి తప్పించుకోవడానికి గజదొంగ పక్కన చేరిన ఈటల రాజేందర్ కు ఓటేయలా. హరీష్ రావు అయిదు నెలల నుంచి ఇక్కడున్న దళిత బంధు ఇప్పిస్తానంటున్నావు. సిద్దిపేటలో దళిత బంధు ఇచ్చావా? దుబ్బాక, హుజుర్నగర్, నాగార్జునసాగర్ లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారా చూద్దామా… బిజెపి మురళీధర్ రావు కు కేసీఆర్ అండగా ఉంటున్నారు. మురళీధర్ రావ్ ఫ్లెక్సీ లో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఫోటో పెట్టలేదు. కాని, దానిని అడగలేని దుస్థితి లో బండి  ఉన్నారు, తన స్వంత ఊరిలో ఫోటో పెట్టకపోతే ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. బండీ!, ఆ పదవికి రాజీనామా చెయ్యి.

డిజిపి ఫోన్ ట్యాప్ అవుతూ ఉంది

రాష్ట్ర పోలీసు విభాగం వర్టికల్ గా సామాజికంగా విడిపోయింది.. రాష్ట్ర డీజీపీ ఫోన్ కూడా టాప్ అవుతోంది.. ఇది దారుణం. నర్సింగరావు, వేణుగోపాలరావు ల చేత ప్రభుత్వం డిజిపి పైన నిఘా పెట్టింది. నర్సింగరావు డీజీపీ పై నిఘా పెడితే. వేణుగోపాల్ రావు మా కుటుంబాల పై నిఘా పెట్టించారు. రిటైర్ అయిపోయిన వారందరిని ఈ ప్రభుత్వం వాడుకుంటు మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. వేల మంది పోలీసులు ఉంటే పదవీ విరమణ చేసిన వారికి బాధ్యతలు ఎందుకు అప్పగించాల్సి వస్తుందో చెప్పాలి

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పార్టీలో చేరొచ్చు.. ఇప్పుడు ఆ సామాజిక వర్గ అధికారులను ఎందుకు వేధిస్తున్నారో చెప్పాలి. నక్సలైట్ల కాలంలోనే భయపడని వారు.. ఇప్పుడు తాము ఎన్నుకున్న ప్రభుత్వంలో ఇంత భయపడాల్సిన పరిస్థితి దాపురించింది. జర్నలిస్టులు స్వేచ్ఛగా భావాలు ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. నిజాం కాలంలో ప్రజలను అణచివేయడానికి భయ పెట్టడానికి కసీం రజ్వి నేతృత్వంలో రజాకార్ల చేత అణచివేసినట్టు ఇక్కడ కేసీఆర్ హరీష్ రావును దించిండు.

హరీష్ రావ్  ఖాసిమ్ రిజ్వి

హరీష్ రావు హుజురాబాద్ లో అన్ని వర్గాలను బెదిరించి ఓట్లు వేయించేందుకు రజ్వి లాగా చేస్తుండు. తెలంగాణ లో హరీష్ రావు ది కాశీమ్ రజ్వి పాత్ర. పరిస్థితి చూస్తుంటే ఆక్రోశం వస్తోంది.. అయ్యో నక్సలిజాం ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. నక్సలైట్లు ఉంటే కనీసం వీళ్ళు భయపడే వాళ్ళు అనే భావన ఏర్పడింది.

హుజురాబాద్ ఉన్న ఎన్నికలు తాత్కాలికం కావచ్చు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెరాస నెత్తిన కాలు పెట్టి తొక్కుతాం. నేను ఎన్నికల్లో ప్రచారం చేయలేదంటున్నారు.. తెరాస అధ్యక్షుడు ఎం చేస్తున్నాడు. గంజాయి ఘుమఘుమ డ్రగ్స్ ఘుమఘుమల్లో మునిగి తెలుతుంటే కొడుకు హైటెక్స్ లో వంటా వార్పులో బిజీ గా ఉన్నారు.. ఇక కాశిం రజ్వి ఇక్కడ ఎవరు కనిపిస్తే వారి గొంతు కోయడానికి తిరుగుతున్నాడు.. హరీష్ రావు తెలంగాణ లో యువత ను రెచ్చగొట్టి వారి ప్రాణాలు తీశారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేస్కుంటా అన్నడు. 100 రూపాయల పెట్రోల్ తెచ్చుకున్న హరీష్ రావు 10 పైసల అగ్గిపెట్టే దొరకలేదు…

త్వరలో తెరాసలో ముసలం పుట్టడం ఖాయం.. కెసిఆర్ గుండె పగలడం ఖాయం. కేసీఆర్ నా ఫోన్ కాల్స్ రహస్యంగా వినకు నేను బహిరంగంగా చెవుతున్న.. రహస్యంగా వింటే నీ గురించి చెప్పే మాటలు వింటే గుండె పగిలి చేస్తావు. ఒక వేళ ఈ ఎన్నికలు రెఫరెండం గా ఓడిపోతే వాళ్ళ మామకు ఏ శిక్ష విధిస్తాడో చెప్పాలి. హరీష్ రావు ఏ శిక్ష వేస్కుంటాడు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *