అమరావతి: గంజాయి సృష్టించిన మంటలు ఆంధ్రలో గప్పున లేచాయి. గుజరాత్ పోర్ట్ లో ఆంధ్ర అడ్రసుతో ఆఫ్గనిస్తాన్ హెరాయిన్ దొరికినప్పటి నుంచి అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య వైషమ్య తీవ్రస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్ మాఫియా కేంద్రంగా వైసిపి ప్రభుత్వం మార్చిందని తెలుగుదేశం పార్టీ కొత్త దాడి ప్రారంభించింది. దీనిని తాడేపల్లి ప్యాలస్ (జగన్ నివాసం)కు ముడేసి విమర్శించడం మొదలుపెట్టింది. పార్టీనేతలంతా ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించేందుకు డ్రగ్స్, గంజాయిని సాధనంగా వాడుకుంటున్నారు. దీనితో దిక్కుతోచని వైసిపి రుజువులు చూపించాలని పోలీసులను రంగంలోకి దింపింది. దీనికి తెలుగుదేశం సమాదానం తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి వివర్శించడం. ఇది టిడిపి కార్యాలయం మీద దాడికి దారి తీసింది.ఈ నేపథ్యంలో
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు. నిన్నదాడుల నుప్రస్తావిస్తూ
తీవ్రంగా మండిపడ్డారు. నిన్న తెలుగు దేశంపార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిపించి ముఖ్యమంత్రి జగన్ నిజంగానే సైకో రెడ్డి అనిపించుకున్నారని విమర్శించారు.
పెంపుడు కుక్కలను తమపైకి పంపి తాడేపల్లి ఇంటిలో దాక్కున్న వ్యక్తి జగన్ అని వ్యాఖ్యానించారు. నేరుగా వస్తే మాట్లాడదామని, పోరాడదామని లోకేశ్ సవాల్ విసిరారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే భయపడతామనుకుంటున్నారా అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడిని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ @ysjagan అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు. నిలదీసే టిడిపి నేతలపై దాడులకు పాల్పడతావా?(1/4)#YCPTerroristsAttack pic.twitter.com/Zw5z0nz4mc
— Lokesh Nara (@naralokesh) October 19, 2021