తిరుపతిలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు గంట సేపు భయంకరమైన ఉరుములు మెరుపులతో ఆకాశం దద్ధరిల్లింది. అనంతరం భారీ వర్షం మొదలయింది. ఇంకా కురుస్తోంది. పట్టణంలోని సత్యనారాయణపురం ప్రాంతంలో ఉన్న కృష్ణ స్వామి ఆలయంపై పిడుగు పడి ఆలయం గోపురం కొంత మేర ధ్వంసం అయింది.