ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా దేవి క్షేత్రం దుర్గమ్మ నామస్మరణ లతో దద్దరిల్లింది. బుధవారం సాయంత్రం పౌర్ణమి ని పురస్కరించుకుని రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆజ్ఞమేరకు అమ్మవారి పల్లకి సేవను ఆలయ కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవను ప్రారంభించారు.
పల్లకి సేవ పీఠాన్ని వివిధ రంగుల పూలతో ఆధ్యాత్మిక త ఉట్టిపడేలా సుందరంగా పండితులు అలంకరించారు. అనంతరం రాజగోపురం నుండి పల్లకి సేవ కొనసాగి శివాలయం ముందు భాగం నుండి పల్లకి సేవ ఊరేగింపు కొనసాగగా. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి ,సాయిబాబా, నరేష్ ,యాదగిరి మరియు వేద పండితులు రాజేష్ శర్మ అర్చకులు రావి కోటి శంకర్ శర్మ ,పార్థివ శర్మ , రామారావు మరియు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పల్లకి సేవలో పాల్గొనేందుకు పోటీపడుతూ అమ్మవారి నామస్మరణ లను ఉచ్చరిస్తూ పల్లకీ సేవలో పాల్గొని తరించిపోయారు.