*టిఆర్ఎస్ ప్లీనరీకి మాదాపూర్ హై టెక్స్ లో ఘనంగా ఏర్పాట్లు
*హాజరుకానున్న సీఎం కెసిఆర్, కేటీఆర్, మంత్రులు, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు
*ఏర్పాట్లను పరిశీలించిన ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరికేపుడి గాంధీ
TRS పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న పార్టీ అధినేత ఎన్నిక కోసం నిర్వహించే ప్లీనరీ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ మంగళవారం ఏర్పాట్లను సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాదాపూర్ హైటెక్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించడంతోపాటు, ఆయా పనులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు.
ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇంచార్జీ లకు సూచించారు. అలాగే అధికారులు, పోలీస్ ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద వారికి పలు సూచనలు చేశారు.
ఈ సమీక్ష సమావేశం లో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రోజా రంగారావు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, GHMC అధికారులు తదితరులు పాల్గొన్నారు.