టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఈ రోజు షెడ్యూల్ విడుదలవుతుంది.
దీనితో అధ్యక్ష ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేడే మొదలవుతుంది. ఈ నెల 22 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 23 న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది.24 న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 25 న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ జరుగుతుంది. అదే రోజు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారు. పర్యవేక్షణ అధికారిగా పర్యదా కృష్ణమూర్తి వ్యవహరిస్తారు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాతే టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.
టిఆర్ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ ను బలపరుస్తూ వివిధ వర్గాల నుంచి నామినేషన్లు వేయనున్నారు .
పార్టీ వర్గల్స్ కథనం ప్రకారం ముఖ్యమంత్రి కెసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని సభ ఏకగ్రీవతీర్మానం చేసే వీలుంది.