బుధవారం నాడు స్టాక్ మార్కెట్లో లో ఉల్లాసం కనిపించింది. చాలా ఇండెక్స్ లు లాభాలతో మొదలై గ్రీన్ లోకి మారాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఉన్నత స్థాయికి దూసుకుపోతున్నాయి. ఉదయం 9.40 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 270 పాయింట్లు లాభపడి 60,555 దగ్గర కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 18,100 దగ్గర ట్రేడ్ అవుతోంది. రిలయన్స్, హెచ్ డిఎఫ్ సి ఈ రోజు ఇండెక్స్ పెరిగేందుకు దోహపడుతున్నాయి.
ఈ వార్త రాస్తున్నపుడు మహింద్ర అండ్ అండ్ మహింద్ర, టెక్ మహింద్ర, బజాజ్ ఆటో ఏసియన్ పెయింట్స్ ఎన్ టిపిసి, బజాజ్ ఫిన్ సర్వీస్, కొటక్ మహేంద్ర లాభాల బాటలో ఉన్నాయి. టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్, ఇన్ ఫో సిస్, హిందుస్తాన్ లీవర్ నష్టపోతున్నవాటిలో ఉన్నాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.36 గా ఉంది.
ఆటో సెక్టర్ ఇండెక్స్ 3 శాతం పెరిగింది. పవర్ సెక్టర్ ఇండెక్స్ 1 శాతం పెరిగితే, బిఎస్ ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.
కోవిడ్ వల్ల 7. 3 శాతానికి కుంచించుకుపోయిన భారత ఆర్థికాభివృద్ధి 2021-22లో 9.5 శాతానికి, 2022లో 8.5శాతంతో పెరుుగుతుందనే నివేదికలువస్తూండటం ఆశాజనక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది. ఈ ప్రకటన ఐఎంఎఫ్ నుంచి రావడంతో భవిష్యత్ మీద ఆశలు చిగురిస్తున్నాయి.