కేంద్ర నిఘాలో ఆంధ్ర తెలంగాణ ప్రాజక్టులు

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రాజక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకుంటు  కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తున్నట్లు  కృష్టా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ తెలిపింది.ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి.

అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది.

గెజిట్ నోటిఫికేషన్ అమలును వాయిదావేయాలని తెలంగాణ కోరుతూ ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర రావు స్వయంగాప్రధాని నరేంద్ర మోదీతో,  కేంద్ర జలశక్తి మంత్రితో  చర్చలు జరిపారు. లేఖ రాశారు. అయినా సరే ఇపుడు తెలుగు  ప్రాజక్టుల మీద  ఈనెల 14నుంచి పెత్తనం బోర్డు దేనని ప్రకటన వెలువడింది.

బోర్డు అలసత్వం, మూడేళ్ల తర్వాత మేల్కొన్న కేంద్రం

(టి లక్ష్మినారాయణ)

కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల అధికార పరిధులను నోటిఫై చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించింది. రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్ళ తదనంతరం ఇప్పుడు బోర్డుల అధికార పరిధులను నిర్ధేశిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏప్రిల్ లో నోటిఫికేషన్ జారీ చేయ చేసింది. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల దగ్గర రెండు రాష్ట్రాలు జుట్లు పట్టుకొన్న చేదు అనుభవాల నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది.

పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా ఆ నోటిఫికేషన్ ప్రస్తావించబోతున్నారని, పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లబోతున్నదన్న అపోహలను రేకిత్తించడం మంచిది కాదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. అవి అక్రమ నిర్మాణాలుగానే భావించబడుతున్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే ప్రాజెక్టుల జాబితాలో చేసే అవకాశమే లేదు. ఒకవేళ ఎవరి ప్రోద్భలంతోనైనా చేర్చితే కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినట్లవుతుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, సెక్షన్ 85(1) నదీ యాజమాన్య బోర్డుల ఏర్పాటు మరియు విధులు: గోదావరి నది యాజమాన్య‌ బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు అని పిలవబడే రెండు వేర్వేరు బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేంద్రం ప్ర‌భుత్వం ఎప్పటికప్పుడు నోటిఫై చేసే ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ మరియు ఆపరేషన్ చేయడం ఆ బోర్డుల బాధ్యత.

(2) ఏదైనా ప్రాజెక్టు మీద సబ్_సెక్షన్ (1) క్రింద‌ బోర్డుకు అధికార పరిధి ఉందా అన్న ప్రశ్న తలెత్తితే దానిపై నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *