మహబూబ్ నగర్ టూరిజం సర్క్యూట్ బస్సు ప్రారంభం

మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆదివారం మహబూబ్ నగర్ లో బస్సును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్  పపర్యాటక శాఖ  ఏ సి బస్సు ప్రారంభించారు.

మన్యంకొండ,పిల్లలమర్రి, కె సి ఆర్ ఎకో అర్బన్ పార్కులు సందర్శించేలా మహబూబ్ నగర్ జిల్లా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేశారు. పర్యాటకులు కేవలం 300/-రూపాయలతో మూడు ప్రదేశాలు చూడవచ్చు.

@5 నుండి 12 సంవత్సరాలలోపు పిల్లలకు టికెట్ 200 /-రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు.

ఈ మొత్తంతోనే మధ్యాహ్న భోజనం,రెండు సార్లు టీ ఇవ్వటం జరుగుతుంది.

ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బస్సు బయలుదేరి పై మూడు ప్రదేశాలు సందర్శించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి కలెక్టర్ కార్యాలయానికి  బస్సు చేరుకుంటుంది.
మన్యం కొండలో అతి శీఘ్ర దర్శనంతో పాటు,ఉచిత ప్రసాదం ఇవ్వబడుతుంది. ముందుగా ఆదివారాలు,సెలవు దినాలలో బస్సు నిర్వహణ

ఈ టూర్ టిక్కెట్ల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టూరిజం కౌంటర్లో కానీ,లేదా ఫోన్ నెంబర్ 8125351022 ద్వారా సంప్రదించి పొందవచ్చు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలే కాక ఇతర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని
జిల్లా పర్యాటక శాఖ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *