ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు తాత్కాలికంగా రద్దు

 

ట్రూ అప్ చార్జీలపై ప్రజా ఉద్యమంతో యూటర్న్ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం!

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల “విజయం” అని తిరుపతి కాంగ్రెస్ నేత , రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు

AP కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు ట్రూ అప్ చార్జీలకు వ్యతిరేకంగా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

ట్రూ అప్ చార్జీలను విరమించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ లేఖలు రాయడం జరిగింది

రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ట్రూ అప్ చార్జీలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడంతో
ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్ చార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది ఆదేశాలు ఉంటాయని ఈఆర్సీ పేర్కొంది. ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆగస్టు 27న ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. యూనిట్‌కు 40 పైసల నుంచి రూపాయి 23 పైసల వరకు ట్రూ అప్ చార్జీలను విద్యుత్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. రెండు నెలల నుంచి ట్రూ అప్ చార్జీలు వసూలు చేశాయి.

పత్రికా ప్రకటన ఇవ్వకుండా, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండా ట్రూ అప్ చార్జీల వసూళ్లపై వినియోగదారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ,ప్రజా సంఘాలు,విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైకోర్టులో పిటిషన్లు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్ చార్జీలను తాత్కాలికంగా రద్దు చేసింది. కాగా దసరా సెలవులు అనంతరం దీనిపై విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.

” గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యుత్ శాఖ అధికారులు ప్రజల నుంచి “ట్రూ అప్” ఛార్జీలను వసూలు చేశారు ఆ రెండు నెలల “ట్రూ అప్” చార్జీలను వచ్చే 2 నెలల విద్యుత్ బిల్లులలో అడ్జస్ట్ చేసి తగ్గించాలని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు ”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *