ఆఫ్గనిస్తాన్ శాంతి నీట మూట అవుతుంది. అబ్దుల్ ఘనీ ప్రభుత్వం ఉన్నపుడు తాలిబన్లు రక్తపాతం సృష్టించారు. ఇపుడు తాలిబన్లు వ్యతిరేకులు రోజు ఎక్కడో ఒక చోట బాంబుల పేలుస్తున్నారు. ప్రజలను చంపేస్తున్నారు.
ఈ రోజు శుక్రవారం ప్రార్థనల సమయంలో కాందూజ్ పట్టణం లోని ఒక మసీదు మీద ఆత్మాహుతి దాడిజరిగింది. టోలో న్యూస్ ప్రకారం 43 మంది చనిపోయారు. 140 మంది దాకా గాయపడ్డారు. సుమారు 300 మంది దాకా దాడిసమయంలో ప్రార్థనలకోసం వచ్చారు. దాడిని జరిగిన విషయాన్ని ఆఫ్గన్ ఇన్ ఫర్మేషన్ కల్చర్ శాఖ మంత్రి జబియుల్లా ముజాహిద్ ధృవీకరించారు. ఈపేలుడు చాలా మంది గాయపడ్డారని ఆయన చెప్పారు.
“శుక్రవారం మధ్యాహ్నం కాందూజ్ పట్టణంలోని ఖానాబాద్ బందర్ ఏరియాలో షియా వర్గానికి చెందినమసీద్ మీద బాంబుదాడిజరిగింది. మాసహోదరులెందరో చనిపోయారు, గాయపడ్డారు,” అని ఆయన ట్వీట్ చేసినట్లు టోలో న్యూస్ (tolo news)రాసింది.
సుమారు 100 మంది దాకా చనిపోయి ఉంటారని సాక్షలును ఉటంకిస్తూ టోలోరాసింది.అయితే, ఎవరూ ఈ పేలుడు బాధ్యత తీసుకోలేదు.
అఫ్గాన్ షియామైనారిటీ కమ్యూనిటీకి చెందిన సయ్యద్ అబాద్ మసీదులో బాంబు పేలుడు అనంతరం మృతదేేహాలు చెల్లాచెదురుగాపడి ఉన్నాయని బిబిసి (BBC) రాసింది.
ఈ మధ్యాహ్నానికే ఆత్మాహుతి సభ్యుడు కుందుజ్ మసీదు లోకి చొరబడ్డాడు. తర్వాత తనను పేల్చుకున్నాడని అల్ జజీరా రాసింది.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఐఎస్ -కె (Islamic State Khorasan IS-K) వర్గం వరుసగా బాంబు పేల్లుళ్లకు పూనుకుంటూ ఉంది. ఆఫ్గన్ విమనాశ్రయంలో జరిగిన బాంబుదాడికి కూడా ఈ వర్గమే కారణం. ఐఎస్ -కె తాలిబన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది.కాబూల్ లోగత అదివారం నాడు ఒక శ్రద్ధాంజలి సమావేశం మీద కూడ ఐఎస్ గురిపెట్టింది. ఈసమావేశానికి అనేక మంది తాలిబన్ నేతలు కూడా హాజరయ్యారు.ఇందులో 5 గురు చనిపోయారు.
తర్వాత నంగరార్,కునార్ ప్రాంతాలలో ఐఎస్ తీవ్ర వాద సంస్థ దాడులు ఎక్కువగా జరుపుతు కల్లోలం సృష్టిస్తూ ఉంది. ఇస్లామిక్ పాలనే అయినా తాలిబన్ల ఎలుబడిలో బాంబుదాడులు, ఆత్మాహుతి దాడులు ఉండవని అనుకున్నారు. అయితే, ఆ నమ్మకం వమ్ము అవుతూ ఉంది.