కొత్త రెండు మూడురోజులుగా జాతీయ వార్త ప్రతి పూట వినపడుతున్న మాట లఖింపూర్ ఖీరి (Lakhimpur Kheri). ఈ వూర్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ కారు రైతుల మీదకు దూసుకుపోయింది. పలువురి మరణానికి కారణమయింది. ఈ దర్ఘగటనలో చాలా మంది గాయపడ్డారు. ఈ సంఘటన యావత్తుదేశాన్ని కుదిపేసింది.ఎందుకంటే, ఈ కారు కేంద మంత్రిది. దీని మీద దేశ మంతా నిరసనలు వచ్చాక ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈలోపు సుప్రీంకోర్టు ముందు పిల్ దాఖలయింది. కోర్టు సుమోటుగా ఈ కేసునుస్వీకరించిందిన కూడావార్తలొచ్చాయి. ఇంత కలకలానికి కారణమయిన లఖింపూర్ లో ఇంతకు జరిగిందేమిటి?
ఆ నల్లటి SUv కారు తనదేనని కేంద్రమంత్రి ఒప్పుకున్నాడు. అయితే ఆయన వివరణ ఏమిటంటే, ఈ కారు మీద రైతుల రాళ్లు, కర్రలు రువ్వారని, అపుడు కారు డ్రైవర్ అదుపుతప్పిందని,ఫలితంగా కారుపక్కనున్న రైతుల మీదకు దూసుకుపోయిందని ఆయన చెప్పారు. అయితే, ఇదంతాఅబద్దమని, కారు మీద ఎవరూ రాళ్లు,రప్పలు రువ్వలేదని, కారు డ్రైవర్ అదుపు తప్పలేదని తెలిపే వీడియో బయటకు వచ్చింది.
ఈ వీడియోని రిషికా బారువా (twitter @rishika625) అనే జర్నలిస్టు ట్విట్టర్ లో షేర్ చేసింది. వొళ్లు జలదరించే వీడియో కేంద్ర మంత్రి చెప్పేదంతా అబద్దమని చెబుతుంది.
ఎందుకంటే, నిరాయుధులయిన రైతుల రోడ్డు మీద తమ సమస్యల మీద జరుగుతున్న ఆందోళనలో భాగంగా నడుచుకుంటూవెళ్తున్నారు. అపుడు మంత్రి కారు కాన్వాయ్ అతివేగంగా వాళ్లని ఢీ కొట్టిదూసుకుపోయింది. ఇది చాలా స్పష్టంగా వీడియోలో చూడవచ్చు. ఉత్తర ప్రదేశ్ లో న్యాయవిచారణ చేయబోయే న్యాయమూర్తి, దీనికి సంబంధించిన పిల్ ను సుప్రీంకోర్టులో విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ధర్మాసనం ఈ వీడియోను తప్పకుండా చూడాలి. వారి దృష్టికి ఇది తప్పక వెళ్లాలి.
లఖింపూర్ ఖీరీలో ఎం జరిగింది?
లఖింపూర్ ఖీరి ఉత్తర ప్రదేశ్ లక్నో డివిజన్ లో ఉంటుంది.ఈ వూరికి ఉత్తర ప్రదేశ్ చక్కెర పాత్ర (Sugar Bowl) అని పేరు. ఈ ప్రాంతంలో ఆసియాలోనే పెద్దవైన మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. రెండు బజాజ్ హిందూస్తాన్ మిల్స్ , బల్రాంపూర్ చీనీ మిల్స్ అనేవి ఈ ఫ్యాక్టరీలు. నిజానికి ఈ ప్రాంతమంతగా ఉద్రిక్తమయింది కాదు. ఇలాంటి వూరు గత ఆదివారం రక్తసిక్తమయింది. కేంద్ర హోమంత్రి అమిత్ షా దగ్గిర జూనియర్ మంత్రిగా పనిచేసే అజయ్ మిశ్రా కారును అక్కడ ఉన్న రైతుల మీది నుంచి దూసుకు పోనిచ్చాడు. కారులో మంత్రి ఉన్నాడా లేక మంత్రి కు మారుడున్నాడా తెలియదు. మంత్రి కుమారుడి మీద హత్యానేరం ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు NDTV రిపోర్టు చేసింది.
ఇది తెలియక చేసింది కాదు. ఎందుకంటే, కారు ఎదురుగా మనుషులు కనబడుతున్నారు. పట్ట పగలు కూడా. చెరకు పంట సరఫరా చేసినందుకు డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన లో ఉన్న రైతులు వీరంతా . వీళ్లకి ‘బుద్ధి’ చెప్పేందుకు కేంద్రమంత్రి కారుని వారి మీదకు నడిపాడని అనుమానం. కారు తనదే నని మంత్రి ఎపుడో అంగీకరించారు.
ఇది హఠాత్పరిణామం కాదని The Wire అంటున్నది. కారును రైతులమీద నుంచి తోలిన ఫలితంగా నలుగురు రైతులు చనిపోయారు. 15 మంది దాకా గాయపడ్డారు. దీనితో ఉద్దేశపూర్వకంగా చేసిందే, పథకం ప్రకారం చేసిందే అనేవాదనకు బలం చేకూరుతూ ఉంది. రిసికా బారువా పోస్టు చేసిన వీడియో దీనిని రుజువుచేస్తున్నది.
ఈ సంఘటన తర్వాత పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో మరొక ముగ్గురు బిజెపి కార్యకర్తులు చనిపోయారు. కచ్చితంగా ఎందురు చనిపోయారో ఇంకా తేలడమే లేదు. తీవ్ర పరిణామాలుంటాయని గత కొద్ది రోజులుగా అజయ్ మిశ్రా ఆందోళన చేస్తున్న చెరకు రైతులను హెచ్చరిస్తూనే ఉన్నాడు.ఈ వీడియో కూడా మీడియాకు దొరికింది. ఆదివారం నాడు, పర్యవసానం గురించి ఆలోచించకుండా ఆయన పథకాన్ని అమలు చేశారనుకోవాలి.. ఈ ప్రాంతంలో చెరుకు రైతులకు సుమారు రు. 5,500 కోట్ల బకాయి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 5లక్షల మంది రైతులు మిల్లులకు చెరకు సరఫరా చేస్తుంటారు.
Bone chilling footage of farmers marching hit from behind by the black SUV— 4 days and counting, no arrests. #LakhimpurKheri pic.twitter.com/cqE7doRJgg
— Rishika Baruah (@rishika625) October 6, 2021