మీకీ విషయం తెలుసా? చంద్రుడి మీదికి దారిచూపింది బధిరులే…

జూలై 20,1969 మానవ జాతి చరిత్రలో ఒక కొత్త అధ్యాయం సృష్టించింది. భూగోళం దాటి ఆకాశలంలోకి ఎగిరి, మనిషి తొలిసారి మరొక నేల మీద కాలుమోపాడు. ఆ నేల చంద్రుడు. ఈ యాత్ర పేరు అపోలో 11 అంతరిక్ష యాత్ర. ఈ సాహసయాత్రకు ముందు ఎన్నో ప్రయోగాలు జరిగాయి.  ఆ ప్రయోగాలు అందించిన విజ్ఞానంతో అంతరిక్ష యాత్ర సాధ్యమయింది. భార రహిత ప్రదేశానికి ఎలా వెళ్లాలి, సుదీర్ఘ యాత్ర ప్రయాణఅనారోగ్యం రాకుండా ఎలా జాగ్రత్త పడాలి,భూమ్యాకర్షణే లేని చోట్ ఎలా ఉండాలనేవి తెలుసుకున్నాకే చంద్రుడి మీద కాలుమోపవచ్చని నిర్ణయించాడు. తమాషా ఏమిటంటే, ఈ చివరి ప్రయోగానికి పూనుకుని చంద్రుడి  మీదికి దారిచూపింది 11మంది బధిరులంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. నిజం నాసా ఈ ప్రయోగం గర్వపడుతూ ఉంటుంది. పై ఫోటో ఈ ప్రయోగానికి సంబంధించిందే.

ఈ ఫోటో అంతరిక్ష ప్రయోగ చరిత్రలో చాలా కీలమమయింది.

ఏదో క్యాబిన్ లో  కూర్చుని  పదకొండుమంది మాట్లాడుకుంటున్నారు. వీళ్లని గాలాడెట్ 11(Gallaudet 11) అంటారు. వీళ్లందరికి వినికిడి సమస్య ఉంది. వీళ్లకి చెవుడు ఉన్నందునే ఒక గొప్పప్రయోగానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ఎంపిక చేసింది.  వీరంతా గ్యాలాడెట్ యూనివర్శిటీకి చెందిన వాళ్లు. అందుకే వీళ్లని ‘గ్యాలాడెట్ 11’ అని పిలుస్తారు. ఈ పదకొండు మందిలోని కొందరు పాల్గొన్న ఒక ప్రయోగం ఫోటో ఇది.

1958- 1968  మధ్య వీళ్లంతా అనేక అద్భుతమయిన ప్రయోగాల్లో పాల్గొని విజయవంతమయ్యారు. చెవుడు వల్లే వీళ్లకెవరికి ఈ ప్రయోగాల ప్రభావం కనపించకుండా పోయింది. వీళ్లతో పాటి ఉన్న నాాసా పరిశోధకులు ప్రయోగంలోని ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేకపోయారు. కొన్ని సార్లు అనారోగ్యం పాలయ్యారు. ఈ కష్టాలని వాళ్లు భరించలేకపోవడంతో ప్రయోగాలను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఈ పదకొండు మంది మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నారు.

మనిషిని చంద్రుని మీదకు పంపేముందు భారరహిత స్థితి మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంతో పాటు ప్రయాణ ఆనారోగ్యం (motion sickness) గురించి కూడా నాసా శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకున్నారు. బధిరులకు మోషన్ సిక్ నెస్ రాదని తెలుసు. ఇది అంతరిక్షంలో ఎలా ఉంటుందో పరిశీలించాలనుకున్నారు. అపుడు గ్యాలాడెట్ యూనివర్శిటీ నుంచి 100 మంది బధిరులను ఎంపిక చేసి, వారిలో నుంచి  పదొకండు మందిని ప్రయోగానికి తీసుకున్నారు.

విమానాలలో భూమ్యాకర్షణ (zero-g) లేకుండా చేసినపుడు మనిషి గాలిలో పల్టీలు కొడతాడు. అపుడు నిలబడేందుకు అలవాటుపడిన మనిషికి ఇలాంటి స్థితిలో కళ్లుతిరిగి వాంతి అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి విమానాలను వామిట్ కామెట్ (vomit comet)అంటారు. భయంకరమయిన ఇలాంటి పరీక్షలకు కూడా వీళ్లందరిని గురి చేశారు.

ఒకరికి తప్ప వీళ్లందరికి స్పైనల్ మెనింజిటీస్ వల్ల చెవిలోపలి వెస్టిబ్యులార్ వ్యవస్థ దెబ్బతినింది. అందువల్ల వీరంతా మోషన్ సిక్ నెస్ కు అతీతంగా ఉంటారు. వీళ్లమీద దాదాపు పదేళ్లు రకరకాల ప్రయోగాలు చేసి శారీరంగా గాని, మానసికంగా గాని వీరెవరికి మెషన్ సిక్ నెస్ అనేది లేదని కనుక్కున్నారు.

చెవి అంతర్భాగంలోన భూమ్యాకర్షణ గుర్తించి సిగ్నల్స్ పనిచేయకపోతే, మనిషి శరీరం ఎలా స్సందిస్తుందనే విషయం ఈప్రయోగాలవల్ల అర్థం చేసుకున్నారు.అదే అమెరికా అపోలో 11 యాత్రలో మనిషి చంద్రుడి మీద దింపేందుకు సహకరించింది.

తీవ్ర కఠిన పరిస్థితుల్లో ప్రయోగాలు

వీళ్లని చాలా కఠిన పరీక్షలకు గురిచేశారు. అయినా సరే ఈ పదకొండు ఒక్క సారి అనారోగ్యానికి గురి కాలేదు. ఒకసారి అమెరికా నోవా స్కోష (Nova Scotia) సముద్రంలో  ఒక భయంకరమయిన తుఫాన్ లోకి వీళ్లనిపడవలో  పంపించారు.అపుడు గంటకి 70 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇంతజరుగుతున్నా, వాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్తాలాడుతూ,సరదాగా మాట్లాడుతూ కూర్చుకున్నారు. వాళ్లకు ఎలాంటి సీసిక్ నెస్ రాలేదు. అయితే, వీళ్లకు తోడుగా వచ్చిన నాసా శాస్త్రవేత్తలు మాత్రం తలకిందులయ్యారు. ఎంతగా సిక్ అయ్యారంటే చివరకు ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మామాకేమీ కాలేదు, అంతజరుగుతున్నా మేం హాయిగా భోజనం కూడా చేశామని ఒకాయన చెప్పారు. వీళ్లిలా ఈ అల్లకల్లోలంలో కూడా భోజనం చేయడంచేసి నాసా పరిశోధకులు ఇంకా సిక్ అయ్యారు.

మరొక ప్రయోగం  20 అడుగుల రొటేషన్ రూంలో 12 రోజులున్నారు. ఈ రోటేషన్ ఎపుడూ తిరుగుతూనే ఉంటుంది. నిమిషాని పది వలయాలు తిరిగే స్పీడు అమర్చారు. అయినా, వాళ్లు చక్కగా తిన్నారు,  నిద్రపోయారు. మొదట్లో నడిచేందేకు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. తర్వాత అలవాటు పడిపోయారు. మరొకప్రయోగం  370 మీటర్ల ఎత్తున ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎలివేటర్ పైకి కిందికి తిరిగినా కళ్లుతిరగడంలాంటివి రాలేదు.

2017 లో గ్యాలాడెట్ యూనివర్శిటీ వీళ్ల జ్ఞాపకార్థం ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసింది. ఇందులో నాటి వలంటీర్లు ముగ్గురు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ పేరు “Deaf Difference+ Space Survival”

ఈ ప్రయోగాల వల్లే భార రహిత స్థితికి అలవాటుపడేందుకు , మోషన్ సిక్ నెస్ రాకుండా ఉండేందుకు ఏమి చేయాలనే విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. మనిషి పైలట్ అంతరిక్ష నౌకను  1961లో , తర్వాత 1969లో ప్రయోగించి అపోల్ 11 నాటికి సూర్యుడి మీద కాలుమోపేందుకు ఈ ‘గ్యాలాడెట్ 11’  ప్రయోగాలే పనికొచ్చాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *