అనంతపురము: మూడు దశాబ్దాల క్రితమే రాయలసీమ ప్రాంత సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికై ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాలు నడిపిన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు, ప్రముఖ రచయిత, అనువాదకులు డా. ఎం.వి రమణారెడ్డి గ సంస్మరణ సభ అనంతపురంలో జరుగుతూ ఉంది. అక్టోబర్ 6 వ తేదిన, బుధవారం పదిగంటలకు అనంతపురము ఎన్.జి.ఓ భవనం ఈ కార్యక్రమం జరుగుతుందని రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం తెలిపింది.
రాజకీయ ఉద్యమాలే కాకుండా ప్రాచీన ఆధునిక సాహిత్యాలు, తెలుగు వ్యాకరణంలోను, పత్రికల సంపాదకులు గాను విశేష ప్రతిభ ఉన్న రమణారెడ్డి గారి బహుముఖ పార్శ్వాల కృషిని ఆయన సమకాలీకులు, అభిమానులు, సాహిత్యకారులు, మేధావులు, ప్రజా సంఘాలు తదితరుల పాల్గొని విజయవంతం చేయాలని వేదిక కోరింది..
అందరికీ హృదయపూర్వక స్వాగతం.
టీమ్..
రాయలసీమ సాంస్కృతిక వేదిక,
వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం,
అనంతపురము.
వివరాలకు:
9963917187,
9492287602