– న్యూఢిల్లీలో కేంద్రమంత్రి చేతుల మీదుగా అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని, సన్మానాన్ని అందుకోనున్న జనగామ బిడ్డ డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ..
– తెలంగాణ నుండి ఏకైక జ్యోతిష్య పండితుడు కావడం విశేషం
జనగామ : న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 17వ తేదీన ఇంటర్నేషనల్ ఆష్ట్రోలజీ ఫెడరేషన్ మరియు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సొసైటీస్ సంస్థతో పాటు అనేక దేశాల నుండి వివిధ జ్యోతిష్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగనున్న వేదిక్ ఆష్ట్రోలజీ కన్ క్లేవ్-2021.
అంతర్జాతీయ జ్యోతిష్య సంస్థల సమ్మేళనంలో జనగామ బిడ్డ, ప్రముఖ జ్యోతిష్య పండితుడు అయిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకోనున్నారు.
ఈ సభకి కేంద్ర జలశక్తి మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సన్మానం జరుగనున్నట్లు ఐఏఎఫ్ సంస్థ వారు ప్రకటించారు. ఈ సభలో లోక్ సభ ఎంపి సునీల్ బి మెందే, ఉత్తరాఖాండ్ మాజీమంత్రి నంద్ కిషోర్, వినిత్ గోయెన్కా, గాయత్రీ వాసుదేవ్, అరున్ బన్సాల్, ప్రోఫెసర్ మహేంద్ర నింబార్తే మరియు పలు ప్రపంచ దేశాలకు చెందిన వివిధ పాశ్చాత్య జ్యోతిష్య పండితులు ఈ సమ్మేళనంలో పాల్గొననున్నారు.
పూర్వం మోహనకృష్ణ భార్గవ జ్యోతిష్యశాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు, జ్యోతిష్య విశారద, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి వంటి అత్యున్నత తరగతులను పూర్తి చేస్కున్నారు.
జ్యోతిష్యశాస్త్రంలో రెండు సిద్ధాంత గ్రంథాలను రచించారు. అనేక పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.. కాగా నేడు ఇంటర్నేషనల్ ఆష్ట్రోలజీ ఫెడరేషన్, యుఎస్ఎ ఆష్ట్రోలజీ ఫెలోషిప్, అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకోనున్న ఏకైక తెలుగు పండితుడిగా నిలువనున్నారు. ఈ అంతర్జాతీయ జ్యోతిష్య సదస్సులో మోహనకృష్ణ పలు పరిశోధన వ్యాసాలను సమర్పించనున్నట్లు తెలియజేశారు.
Super