కోవిడ్ మూడో వేవ్ ముప్పు తప్పితే తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు.
తిరుమల అన్నమయ్యభవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. మల్లికార్జున – అనంతపురం
ప్రశ్న: అక్టోబరు 7న ఎంఎల్ఏ సిఫార్సు లేఖపై శ్రీవారి దర్శనానికి రావచ్చా ?
ఈవో : రావచ్చు.
2. భానుప్రకాష్ – చిత్తూరు
ప్రశ్న: తిరుమల అఖిలాండం వద్ద ఉన్న టెంకాయల కౌంటర్ వద్ద కర్పూరం నాణ్యత సరిగా లేదు ?
ఈవో : పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
3. కేశవాచారి – మదనపల్లి
ప్రశ్న: కోసువారిపల్లి ఆలయం టిటిడి పరిధిలోకి తీసుకుని 12 సంవత్సరాలు అయ్యింది. రాజగోపురం, పుష్కరిణి లేదు, దాతలు స్థలం ఇచ్చారు. ముదివేడు క్రాస్‌లో టిటిడి ఆలయం అని బోర్డు లేదు ?
ఈవో : త్వరలో అభివృద్ధి పనులు, ఆర్చిల నిర్మాణం చేపడతాం. ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
4. జయకృష్ణ – నెల్లూరు
ప్రశ్న: ఎస్ఎస్డి టోకెన్లు లభ్యం కావడం లేదు ?
ఈవో : సెప్టెంబరు 25న అక్టోబరు 31వ తేదీ వరకు ఎస్ఎస్డి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేశాం. గంటలోపే అయిపోయాయి. నవంబరులో కోవిడ్ – 19 మూడో వేవ్ ముప్పు లేదనుకుంటే కొన్ని టోకెన్లు కౌంటర్లలో ఇస్తాం.
5. వెంకటేశ్వర్లు – నెల్లూరు
ప్రశ్న: అన్నప్రసావం ట్రస్టుకు విరాళం ఎలా ఇవ్వాలి ?
ఈవో : టిటిడి అధికారులు మిమ్మల్ని సంప్రదించి వివరాలు తెలియజేస్తారు.
6. ఉమేష్ – హైదరాబాద్
ప్రశ్న: గీతా పారాయణం కార్యక్రమాలను సిడిల రూపంలో విడుదల చేయండి ?
ఈవో : బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనుండడం వలన 600 మందికి మాత్రమే ఆన్లైన్లో స్లాట్ విడుదల చేశాం. 10 నిమిషాల్లో సేవకులు స్లాట్ మొత్తం బుక్ చేసుకున్నారు.
9. గోపి – తిరుపతి
ప్రశ్న: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు, శుక్రవారం అమ్మవారి అభిషేకం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలి.
ఈవో : చర్యలు తీసుకుంటాం.
10. ప్రభు – చెన్నై
ప్రశ్న: గ్రామాల్లోని వారికి కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల సర్టిఫికెట్ రావడం లేదు.
ఈవో : వ్యాక్సిన్ వేసుకున్నవారికి తప్పకుండా వస్తుంది లేదా 72 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలి.
ఈవో : సాంకేతిక కారణాల వల్ల కొంత కాలం పాటు పత్రిక ముద్రణ ఆగింది. త్వరలోనే పోస్టల్ ద్వారా పంపే ఏర్పాట్లు చేస్తాం.
15. నాగేంద్ర – హైదరాబాద్
ప్రశ్న : అక్టోబరు 8వ తేదీకి రూ.300/- దర్శనం టికెట్లు బుక్ చేశాం. అకౌంట్ నుండి డబ్బు కట్ అయ్యి టికెట్లు బుక్ అయినట్లు మెసేజ్ వచ్చింది. తరువాత మూడు రోజులకు టికెట్లు బుక్ కాలేదని మెసేజ్ వచ్చింది. ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నందున మమల్ని దర్శనానికి అనుమతించాలి.
ప్రశ్న : సర్వదర్శనం టికెట్లు పోస్టాఫీస్‌లో ఇచ్చే ఏర్పాట్లు చేయాలి.
ఈవో : కోవిడ్ నేపథ్యంలో ఇది సాధ్యం కాదు.
17. వెంకటేశ్వర్లు –
ప్రశ్న : వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వృద్ధులకు నేరుగా సర్వదర్శనం కల్పించాలి.
ఈవో : కోవిడ్ నేపథ్యంలో ఈ ప్రతిపాదన సాధ్యం కాదు.
18. సోమయాజులు – కొత్తపేట
ప్రశ్న : నాదనీరాజనం వేదికపై మా అమ్మాయికి నృత్యం చేసే అవకాశం కల్పించండి.
ఈవో : తప్పకుండా అవకాశం కల్పిస్తాం.
19. ఉషా – కాంచీపురం
ప్రశ్న : బ్రహ్మోత్సవాల్లో స్వామివారి గరుడ సేవ చూడటానికి అవకాశం కల్పించండి.
ఈవో : కోవిడ్ వ్యాప్తి కట్టడి కోసం ఈ సారి కూడా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తున్నాం. శ్రీవారి వాహనసేవలు ఎస్వీబిసి ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తాం.
20. శ్రీలక్ష్మి – తిరుపతి
ప్రశ్న : తిరుమలలో సాయంత్రం 5 గంటల తరువాత గదులు ఇవ్వమని చెప్పారు.
ఈవో : అలాంటిది ఏమి లేదు. గదుల లభ్యతను బట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు. సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలి.