నేను గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది: .ఈటల

కరీంనగర్:
జమ్మికుంట మండలం నాగారం నుంచి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈటెల రాజేందర్  ప్రతి సారీ నాగారం ఆంజనేయ స్వామి గుడి నుండి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతుంటారు.
అక్కడ ఆయన చేసిన ప్రసంగం:
 18 సంవత్సరాలుగా నన్ను ఒక్కరు కూడా పల్లెత్తు మాట అనలేదు. ఇన్ని సంవత్సరాలుగా మీ అందరూ గర్వపడేలా పని చేశాను. ముఖ్యమంత్రి సైతం గీత గోవిందం నా తమ్ముడు అని పొగిడాడు. ఈ తమ్ముడు జీతం ఇస్తే నాకు జీతం వస్తుంది అని చెప్పిన కేసీఆర్ ఇన్ని సంవత్సరాలుగా కుడిభుజంగా ఉన్న తమ్ముడు ఇప్పుడు దయ్యం ఎట్లా అయ్యాడో ఆలోచన చేయాలి.
కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశాను అసెంబ్లీలో లో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈటల రాజేందర్ ప్రజలు ప్రాణాలు కాపాడడంలో బాగా పని చేశారు అని పొగిడారు. అలా పొగడడం చూసిన కెసిఆర్ తట్టుకోలేక పోయారు.
ఆ తరువాత ఎవరు సీఎం కావాలి అని చర్చ జరిగినప్పుడు ఎందుకు ఈటల రాజేందర్ కాకూడదు అని కొంతమంది మాట్లాడితే అది కంట్లో పెట్టుకొని పంట్లో నుండి తీసివేసిండు. నన్ను బయటికి పంపే వరకు నిద్రపోలేదు.
రాజీనామా చెయ్యి అంటే సిగ్గు లేని బ్రతుకు ఎందుకు అని మీ ముందుకు వచ్చాను.
రాజీనామా చేసినప్పటి నుండి ఎన్ని ఉత్తరాలు పుట్టిస్తున్నారు నేను సీఎం కి సరెండర్ అయ్యానని ఒకటి ఇస్తే ఇది ఎవరు రాశారో తేల్చాలని కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు పట్టించుకోలేదు.
దళిత బంధు వద్దు అన్నాను అని ఇంకోటి పుట్టించారు. అది తప్పు అని ఆంధ్రజ్యోతి లో వార్త కూడా వచ్చింది.
ఇగో ఇంత దారుణానికి ఒడగడుతున్నరు.
నిన్న ఒక మంత్రి అంటున్నారు… నాకు నేనే నా మీద దాడి చేయించుకొని చేతులకు, కాళ్ళకు కట్లు కట్టుకొని సానుభూతి పొందాలని చూస్తున్నారట.
మీరు మూర్ఖులు. పచ్చకామెర్లు వారి లాగా మీరు అలా చేసి నటిస్తారు.
నేను ప్రజల గుండెల్లో ఉన్నా.
ఇంత నీచమైన మాటలా ?
నన్ను ఓడగొట్టే సత్తా కెసిఆర్ డబ్బు, మద్యం, దబాయింపులకు లేదు.
కెసిఆర్ బానిసల్లారా, నేను కష్టపడి బలంగా తయారు చేసిన పార్టీ లోకి వచ్చింది మీరు.
మీ నియోజకవర్గం లో మీరు దద్దమ్మలు.
ఒక్కడి మీద ఇంత మంది పగపట్టారు. బెదిరింపులకు దిగుతున్నారు.
చిన్నపిల్లలు కూడా ‘తూ’ అని మాట్లాడుతున్న సిగ్గు రావడం లేదా ?
నిండు మనసుతో గ్రామం అంతా సంపూర్ణంగా ఆశీర్వదించండి. నేను గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది.ఫార్మ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ రోడ్డు మీదకు వస్తారు. కెసిఆర్ అహంకారం అనుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *