టాటాల చేతుల్లోకి ఎయిరిండియా వెళ్లిందని మీడియాలో వస్తున్న వార్తల మీద కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ వార్త తప్పు అని తాము త్వరలో ప్రకటన చేస్తాము ట్వీట్ చేసింది.
Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS
— Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021
ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిరిండియా ను గ్రూప్ బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుందనే వార్త చక్కర్లు కొడుతూ ఉంది. కోట్ల నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో ఎయిరిండియాను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
Tata Sons wins the bid for national carrier Air India. Tata Sons was the highest bidder. Union Home Minister Amit Shah-led ministerial panel has given approval to this bid: Sources pic.twitter.com/99OdR9LXCA
— ANI (@ANI) October 1, 2021
ప్రైవేట్ పరం చేయాలని భావించింది. తన నిర్ణయానికి అనుగుణంగానే బిడ్డింగ్ నిర్వహించింది. ఎయిరిండియాను సొంతం చేసుకోవడానికి టాటా సన్స్ తో పాటు స్పైస్ జెట్ కూడా బిడ్డింగ్ లో పాల్గొంది. ఈ పోటీలో చివరకు ఎయిరిండియాను టాటా సొంతం చేసుకుందని వార్త ప్రచారమవుతూ ఉంది.
Tata Airlines was started by JRD Tata in 1932 & in July 1946, it took the name Air India. In 1948 it was nationalized, and on 8th June that year, the Malabar Princess flew its first international flight.
Today, Tata Sons might just have won the bid to run Air India again. pic.twitter.com/n3QigaPlBb— Joy Bhattacharjya (@joybhattacharj) October 1, 2021
స్వాతంత్ర్యానికి ముందు ఎయిరిండియాను టాటా గ్రూప్ నిర్వహించేది. జేఆర్డీ టాటా 1932లో ఎయిరిండియాను స్థాపించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎయిరిండియాను జాతీయం చేశారు. దీంతో, ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థగా మారిపోయింది. 68 సంవత్సరాల తర్వాత ఈ సంస్థ మరోసారి టాటాల వశమవుతుందేమో చూడాలి.