హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.
2001 నుండి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కి అండగా పార్టీకి నిబద్దతగా, క్రమశిక్షణతో పదవిలో ఉన్నా, లేకున్నా ఉద్యమం చేసిన నిజమైన ఉద్యమకారుడు గెల్లుశ్రీనివాస్ యాదవ్ అని, అందుకే కేసీఆర్ గారు గెల్లును బలపర్చారని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు
ఈ సందర్భంగా మాట్లాడిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుజురాబాద్లో పోటీచేయడానికి అవకాశం ఇచ్చిమన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలయజేసారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన బిడ్డగా తనను ఆశీర్వదించాలన్నారు, హుజురాబాద్ అభివ్రుద్దికోసం అహర్నిషలు అందుభాటులో ఉండి కష్టపడతానన్నారు, ప్రజలంతా కులమతాల కతీతంగా ఓటేయాలని అభ్యర్థించారు, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దుతు తెలయజేయాలని ప్రతీ ఒక్కరూ కారు గుర్తుపై ఓటేయాలని అభ్యర్తించారు.
మాజీ ఎంపి, ప్రణాళిక బోర్డ్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఆత్మగౌరవం పేరుతో ఈటెల ఆత్మవంచన చేసుకుంటున్నారన్నారు, హుజురాబాద్ ప్రజలకు ఆత్మగౌరవ సమస్యలేదన్నారు, హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంటా, కమలాపూర్ రైతులు, ప్రజలకు అప్పుల తిప్పలు లేకుండా రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచితకరెంటు ద్వారా కోట్లాది రూపాయల్ని అందించి హుజురాబాద్ తో పాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ గారు నిలబెట్టారన్నారు. వెన్నుపోటుదారుల వెన్నులో వణుకుపుట్టేవిదంగా టీఆర్ఎస్ అభ్యర్తిగా పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ని ప్రజలు గెలిపించబోతున్నారన్నారు.
.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక నేతలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.