‘బండి’ పాదయాత్రకు 36 రోజులు, హుశారుగా సాగుతున్న యాత్ర

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ యాత్ర రేపు అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి 36 రోజులపూర్తి చేసుకుంటుంది.  ఇంతవవరకు పాదయాత్ర   438 కి.మీలు సాగింది.

ఈ పాదయాత్రకు పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గిర తొలి అడుగు వేసిన బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు కాలినడక ద్వారా 438 కిలోమీటర్లు ప్రయాణం సాగించా3రు.

35 సభల్లో ప్రసంగం..

భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడి నుంచి   ఇప్పటి వరకు పాదయాత్రలో ప్రజలను కలుస్తూనే వారి సమస్యలు వింటూ భరోసానిచ్చేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల వివరాలను వెల్లడించేందుకు  మొత్తం 34 సభలలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారారు.  రేపు జరగబోయే హుస్నాబాద్ సభతో కలిపితే మొత్తం 35 సభలు నిర్వహించినట్లవుతుంది.   చార్మినార్, గోల్కొండ, ఆరె మైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, మోమిన్ పేట్, సదాశివపేట, సంగారెడ్డిలో 2, జోగిపేటలో 2, రంగంపేట, నర్సాపూర్ లో 2, మెదక్ లో 2, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డిలో 2, ఎర్రపాడు, తాడ్వాయి, లింగంపేట, కామారెడ్డిలో 2, మాచారెడ్డి చౌరస్తా, గంభీరావుపేట, ముస్తాబాద్, అంకిరెడ్డిపల్లె, పెద్ద లింగాపూర్, ఇల్లంతకుంట, బెజ్జంకి, కోహెడ, పొట్లపల్లి, హుస్నాబాద్ ప్రాంతాల్లో బండి సంజయ్ కుమార్ సభలు నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిచోట జనం విపరీతంగా హాజరుకావడం విశేషం

యాత్ర తొలిరోజున

19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 జిల్లాల్లో…

ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ కుమార్ తొలిదశ పాదయాత్ర ద్వారా 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నడుస్తూ ప్రజలను కలిశారు. మొత్తం 8 జిల్లాల్లో తొలిదశ పాదయాత్ర చేయడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో పాదయాత్ర జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూస్తే చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, కార్వాన్, రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాద్  నియోజకవర్గాల్లో నడిచారు.. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయడం జరిగింది.

జాతీయ నాయకత్వం మద్దతు

సంజయ్ పాదయాత్రకు జాతీయ నాయకత్వం బాగా మద్దతునిస్తున్నది. ఎప్పటికపుడు జాతీయనేతలను పాదయాత్రకు పంపి నైతికబలం చేకూరుస్తూ ఉంది. ఇంతవరకు   ఇద్దరు మాజీ సీఎంలు (దేవేంద్ర ఫడ్నవీస్, రమణ్ సింగ్) 6 గురు కేంద్ర మంత్రులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అట్లాగే 4 గురు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, 4 గురు జాతీయ ఉపాధ్యక్షులు, 4గురు జాతీయ మోర్చాల అధ్యక్షులు, ఇద్దరు జాతీయ కార్యదర్శులు, 4 గురు ఎంపీలు బండి సంజ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. వీరుగాక పలువురు కేంద్ర, రాష్ట్రాల మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొనబోతున్నారు.

హుస్నాబాద్ సభను విజయవంతం చేయండి

అక్టోబర్ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించే తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర రోడ్ షో, బహిరంగ సభకు పెద్దఎత్తున  హాజరై సభను విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ విజ్ఝప్తి చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *