బద్వేల్ ఉప ఎన్నిక: వైసిపి అభ్యర్థి పేరు ప్రకటించిన జగన్

 

అమరావతి : దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య సుధ నే
వైసిపి పార్టీ  అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈరోజు ఆయన బద్వేలు ఉప ఎన్నిక  సమీక్ష సమావేశం నిర్వహించారు.పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడకు వచ్చిన వారి అందరిమీదా ఉన్నాయని అన్నారు.
నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిస్తూ 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చింది, గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధగారికి రావాలని ఆయన సమావేశానికి వచ్చిన వారికి చెప్పారు.
“ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదు, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలి, 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగింది,ఓటింగ్‌ శాతం పెరగాలి, ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలి,’ అని ఆయన అన్నారు.

ఎన్నికలకోసం  ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని, ప్రతి మండలాన్ని కూడా బాధ్యులకు అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని చెప్పారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి వారిని అభ్యర్థించాలి.
వారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యం చేయాలి.
నెల రోజులపాటు మీ సమయాన్ని కేటాయించి, ఎన్నికపై దృష్టిపెట్టాలి.
బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు
వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలి.
మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయండి.

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్‌ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *