‘భారత్ బంద్’ స్పందనని ఎలా అర్థం చేసుకోవాలి?

(వడ్డేపల్లి మల్లేశము)

రైతే రాజంటు విస్తృత ప్రచారం చేస్తున్న ప్రభుత్వాలు రైతుల, రైతు సంఘాల, అఖిల పక్షాల అభిప్రాయాలను తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.

రైతు పోరాటం ఉధృతమైన కొద్ది ప్రభుత్వాలు ఆలోచించినవి. న్యాయ వ్యవస్థ కూడా ప్రతిస్పందించింది ఇది నిజమైన ప్రజా ఉద్యమం యొక్క ఫలితంగా చెప్పుకోవచ్చు.

చట్టాల నేపథ్యం

2017 లో ప్రతిపాదించిన రైతులకు సంబంధించిన చట్టాలు 2019 లో ఒక కొలిక్కి రా గా 2020 సెప్టెంబర్ 15, 18 తేదీలలో లోక్సభ ఆమోదం పొం దగా20, 22 తేదీలలో రాజ్యసభ ఆమోదం పొందడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకున్న ది. ఆమోదం పొందిన మూడు బిల్లులు పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంటు బయట కూడా దేశ వ్యాప్తంగా రైతులు రైతు సంఘాల మధ్య చర్చ జరగకుండానే చట్టం గా మారడమే అసలు సమస్య గా మారిపోయింది.

2020 సెప్టెంబర్ 28వ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో మూడు బిల్లులు చట్టాలుగా మారిపోయినవి. మొదటి నుండి వ్యతిరేకిస్తున్న రైతులు రైతు సంఘాలు తమ గోడు వినిపించుకోకుండా చట్టాలుగా మార్చినందుకు నిరసనగా 2020 నవంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా రైతు ఉద్యమం ప్రారంభమై నేటికీ దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ విషయంలో రైతు సంఘాలను, మద్దతిస్తున్న రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను అభినందించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.

పోరాట ఫలితం

నిరంతరాయంగా జరిగిన పోరాట ఫలితంగా భారత సర్వోన్నత న్యాయస్థానం రైతు చట్టాల పోరాటంలో జోక్యం చేసుకుని చట్టాల అమలును సంవత్సరం పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం రైతు సంఘాల పోరాటాన్ని తప్పుపట్టలేం అని ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చల ద్వారా ముగింపుకు రావాలని సంఘాలను కోరింది.
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టాల అమలును సంవత్సరం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి 0ది. అయినప్పటికీ రైతులు తమ పోరాట కార్యక్రమాన్ని వీడలేదు. గతంలో రెండు సార్లు భారత్ బంద్కు పిలుపు ఇచ్చినటువంటి రైతు సంఘాల సమాఖ్య తిరిగి 2021 సెప్టెంబర్ 27న అన్ని ప్రతిపక్ష పార్టీల సంపూర్ణ మద్దతు తో భారత్ బంద్కు పిలుపు నిచ్చిన విషయం అందరికీ తెలిసినదే.

సెప్టెంబర్ 27 భారత్ బంద్- ఒక పరిశీలన

గతంలో రైతు సంఘాలకు మద్దతు ఇచ్చినటువంటి అనేక పార్టీలు మాటమార్చి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారి తమ విధానాన్ని మార్చుకున్నవి. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ మొదట్లో రైతులకు మద్దతుగా బహిరంగ ప్రదర్శన నిర్వహించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు కాబోలు తర్వాత కాలంలో ఈ బందు సందర్భంగా కూడా విజయవంతం కాకుండా అడ్డుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ ను విజయవంతం చేసే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జెడి, ఎస్ పి , బి ఎస్ పి స్థానికంగా ఉన్న రాష్ట్ర పార్టీలు కూడా ఇందుకు పూర్తి మద్దతు ఇచ్చినవి. ఆంధ్రప్రదేశ్లో వైసిపి సంపూర్ణ మద్దతు ప్రకటించగా పశ్చిమ బెంగాల్లో అధికార టిఎంసి రైతుల డిమాండ్లకు మద్దతు తెలిపినప్పటికీ బంధు నిర్వహణకు సహకరించలేదు.
రైతులతో పాటు మద్దతిస్తున్న రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున రైళ్లను , జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో బంద్ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలలో గణనీయంగా కనపడింది. పంజాబ్లో రైతులు రైల్వే ట్రాక్ పై బైఠాయించడంతో 25 రైళ్లు రద్దు అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా.
27 సెప్టెంబర్ భారత్ బంద్ ప్రభుత్వ ప్రతిస్పందన*:-
***********
రైల్వే వ్యవస్థతో పాటు జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు తీవ్ర ఇబ్బందులకు గురి అయిన కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంధు ప్రభావాన్ని తీవ్రంగా పరిగణించిన వి. సుమారుగా గత సంవత్సర కాలంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలిపిన ప్పటికీ అనేక కారణాల వలన చాలా మంది రైతులు చనిపోయినప్పటికీ ఆ కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయని కేంద్ర ప్రభుత్వం తరచుగా చర్చలకు రావాలని రైతు సంఘాలను మాత్రం అనేకసార్లు ఆహ్వానించిన ది.
దేశవ్యాప్తంగా బంద్ కొనసాగిన నేపథ్యంలో స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులు తమ ఆందోళన మార్గాన్ని విడిచిపెట్టి చర్చలకు రావాలని చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఢిల్లీ, కేరళ, తమిళనాడు ,పంజాబ్, హర్యానా, ఉత్తరాది రాష్ట్రాలలో గణనీయంగా జరిగిన సంపూర్ణ భారత్ బంద్ రైతు సంఘాల లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

దేశవ్యాప్తంగా ను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు విచ్చలవిడిగా అరెస్టు చేసి భారత్ బంద్ కు తీవ్ర అవాంతరాలను కల్పించినప్పటికీ ఉద్యమ తీవ్రతను అడ్డుకోలేక పోయారు అనేది నగ్నసత్యం. ఈ సందర్భంగా హైదరాబాదులో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,వామపక్షాలు,ప్రతిపక్షాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలను తేవడమే కాకుండా ప్రైవేటీకరణ ముసుగులో దేశాన్ని అమ్మేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో జీవితబీమా సంస్థ తో సహా రైల్వే లు, విమానాశ్రయాలు, ఓడరేవులు వంటి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగానైనా దేశ ప్రజలు గుర్తించకపోతే ప్రజల హక్కులకు భంగం వాటిల్లక తప్పదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోమారు దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్ట వలసిన అవసరం ఉన్నదని ప్రస్తుత పరిస్థితులు ఆలోచింప చేస్తున్నవి.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, బుద్ధిజీవులు, మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, రైతులు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ప్రజా వ్యతిరేక రైతు చట్టాలతో పాటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉన్నది అని రాజకీయ విశ్లేషకులు పిలుపిస్తున్నారు. రైతు చట్టాల్లో ఉన్నటువంటి ప్రజావ్యతిరేకత రైతులకు సంభవించబోయే నష్టాన్ని దేశ ప్రజానీకం ఎప్పటికప్పుడు అవగాహన చేసుకొని ఉద్యమాలకు మద్దతు ఈయడం ప్రతి పౌరుని తక్షణ కర్తవ్యం.


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయులు ఉద్యమనేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *