కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల పక్షాలు ఇచ్చిన భారత్ బంద్ సందర్భంగా హైదరాబాద్ లో పాల్గొన్న ఆచార్యుడిని ఉద్దేశ్య పూర్వకంగా పోలీసులు టార్గెట్ చేశారని తెలంగాణ జన సమితి ఆరోపించింది.
అరెస్టు సందర్భంగా పోలీస్ లు ఓవరాక్షన్ చే శారని. కోదండరామ్ పై పోలీస్ లు విచక్షణా రహితంగా దాడి చేసి ఒంటి మీద బట్టలు చించివేసి దారుణంగా వ్యవహరించారని పార్టీ పేర్కొంది.తెలంగాణ యోధుడు కోదండరాం సార్ పట్ల పోలీస్ ల అనుచిత ప్రవర్తన ఆక్షేపనీయమ్, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి,ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని *తెలంగాణ జన సమితి రాష్ట్రప్రధాన కార్యదర్శిధర్మఅర్జున్ ,బైరి రమేష్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం లో ప్రజలను ఐక్యం చేసే ప్రతి సందర్భంలో కేసీఆర్ ప్రభుత్వం కోదండరాం పై పోలీసులతో దాడి చేయిస్తున్నదని సీమాంధ్ర పాలకులు కూడా పాల్పడని దాష్టీకానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకుంటుందని వారు విమర్శించారు.