నేటి మేటి ఫేకు వార్త.
ఫోటోషాప్ వంటి సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి న్యూయార్క్ టైమ్స్ కు భారత్ ప్రధాని మోదీ కి ముడేశారు. ప్రధాని మీద గౌరవంతో సృష్టించిన న్యూస్ కాది. NYT ఇలా ప్రధానిని కీర్తించినట్లు చెప్పారు. అంటే ప్రధాని మోదికి న్యూయార్క్ టైమ్స్ సర్టిఫికెట్ అవసరమని భావించారు. ప్రపంచమంతా కీర్తింపబడే భారత ప్రధానికి అమెరికా పత్రిక సర్టిఫికేట్ అవసరమా అనే ఆలోచన లేకుండా నూటముప్ఫై కోట్ల ప్రజల ప్రధానికి బోగస్ సర్టిఫికెట్ ఇప్పించారు.
మొత్తానికి ఈ ఫేక్ న్యూస్ వైరల్ అయింది. చాలామంది ఇది నిజమే అనుకుని బాగా షేర్ చేశారు. బీజేపీ అధికార పత్రికలు కూడా చేయనంత భజన అమెరికా పత్రిక చేస్తుందా అనే అనుమానం లేకుండా ఫేక్ న్యూస్ ను షేర్ చేశారు. అనుమానం వచ్చిన వాళ్ళు ఫాక్ట్ చెక్ చేశారు. False News అని తేలింది.
నిజానికి దీనిని NYT ప్రచురించనేలేదు. ఈ అమెరికా పత్రికలో ఇలాంటి కధనం లేనే లేదని అనేక fact check లలో తేలింది. 26 సెప్టెంబర్ 2021 ‘న్యూయార్క్ టైమ్స్’ అసలు మొదటి పేజీ ఇక్కడ చూడవచ్చు.
https://static01.nyt.com/images/2021/09/26/nytfrontpage/scan.pdf?utm_source=check_report
Fake News సృష్టించే వాళ్లు మహా అజ్ఞానులు. బోగస్ న్యూస్ సృష్టించే క్రమంలో వొళ్లు మరచిపోయి, తమ భక్తినంతా గుప్పిస్తారు. కనీసం తాము సృష్టించిన వార్తలో తప్పులు లేకుండా కూడా జాగ్రత్త తీసుకోరు. ఈ ఫేక్ వార్తలో September స్పెల్లింగ్ తప్పు ఉంది. అంతేకాదు, ఫేక్ వార్త రాస్తూ వొళ్లు మరిచిపోయారు. చివర నినాదాలు కూడా ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక మోదీని విశ్వనేతగా ప్రశంసించినా నినాదాలు ఇస్తుందా?
“Last, Best Hope of Earth” అనే హెడ్లైన్ కింద : “World’s most loved and most powerful leader, is here to bless us.” రాశారు. న్యూయార్క్ టైమ్స్ రాసినట్లు చెబుతున్న ఈ ఆర్టికిల్ లో చివర ‘హర హర మహాదేవ’ అని రాసి దొరికి పోయాడు.
మూడు రోజుల అమెరికా యాత్రను భారత ప్రధాని మోదీ విజయవంతంగా ముగించుకుని ఆదివారం నాడు ఇండియా తిరిగొచ్చారు. ఇది చాలా ఫలప్రదమయిన పర్యటన అని పేరొచ్చింది. ప్రధాని చాలా హుందాగా ప్రవర్తించారు. అమెరికా కూడా ఆయనను సముచిత రీతిన గౌరవించింది.
అయితే,ఫేక్ న్యూస్ రాసి ఈ పర్యటనను ఒక జొక్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే, పేక్ న్యూస్ వల్ల వార్త వైరలయి, జోక్ అవుతుంది. ఇదే ప్రధాని బొమ్మవాడుకుని న్యూయార్క్ టైమ్స్ వార్తగా ప్రచారం చేసే ప్రయత్నం.