అక్టోబర్ 2 వరకు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు అయింది.
మొదటి దశ ముగింపుహుజూరాబాద్ లో ఉంటుంది. అక్కడే బహిరంగ సభ జరుగుతుంది.
రేపు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, మాజీ ఎంపీ విజయశాంతి యాత్రకు హాజరు అవుతారు. ప్రజా సంగ్రామ యాత్ర తొలి దశ షెడ్యూల్ అక్టోబర్ 2 నాటికి హుజూరాబాద్ కు చేరనుంది.
ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.
అనంతరం మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇల్లెంతకుంట మీదుగా సిద్దిపేట జిల్లాలోకి ప్రజా సంగ్రామ యాత్ర ప్రవేశించనుంది.
సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి, కోహెడ మండలాల్లో పాదయాత్ర కొనసాగనుంది.
అక్కడి నుండి కరీంనగర్ జిల్లాలోని బోర్నపల్లి మండలంలోని గ్రామాల మీదుగా హుజూరాబాద్ వరకు యాత్ర కొనసాగనుంది.
అక్టోబర్ 2న హుజూరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభతో బండి సంజయ్ కుమార్ తొలిదశ ‘పాదయాత్ర’ షెడ్యూల్ పూర్తి కానుంది
ఈనెల 28న బెజ్జంకి మండలంలో జరిగే బండి సంజయ పాదయాత్రలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ చాహర్,
29న కోహెడ మండలంలో జరిగే పాదయాత్రలో బీజేపీ సీనియర్ నేత, ఘోరక్ పూర్ ఎంపీ రవి కిషన్ పాల్గొంటారు.
30న కొనసాగే పాదయాత్రలో ఢిల్లీ నార్త్ ఈస్ట్ ఎంపీ మనోజ్ తివారీ హాజరై బండి సంజయ్ కు సంఘీభావం తెలపనున్నారు.