పశ్చిమదేశాల న్యూస్ పేపర్లు ఎలా పని చేస్తాయంటే…

అబద్దాల ప్రయోగ శాలగా పశ్చిమదేశాల ప్రసార మాద్యమాలు
మైత్రేయ భకల్
అనువాదం : రాఘవ శర్మ
పశ్చిమ దేశాలు స్వేచ్ఛగా ఉన్నాయి.
అక్కడ ప్రసార మాద్యమాలు కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగానే వ్యవహరిస్తాయి. అవి చాలా గట్టిగా మాట్లాడతాయి.
చాలా బాధ్యతాయుతంగా పనిచేస్తుంటాయి. అందుకే వాటిపైన మనకు అంతులేని విశ్వాసం.నిజమే, అవి సత్యానికి వ్యతిరేకదిశలో పనిచేస్తుంటాయి.
పశ్చిమదేశాలలో, ముఖ్యంగా అమెరికాలో ప్రసార మాద్యమాలు సమాజాన్ని అదుపు చేసేలా ఉంటాయి.
ప్రజలను గట్టిగా పట్టి బంధించడంలో అమెరికా నాయకులు బాగా ఆరితేరారు. అమెరికా ప్రజలంతా గట్టి నిఘాలో ఉంటారు.
అక్కడ రాజకీయ కార్యకలాపాలన్నీ రెండు పార్టీలకే పరిమితమై ఉంటాయి. తామంతా స్వేచ్ఛగా ఉన్నామని అక్కడి ప్రజలంతా భావిస్తుంటారు. అక్కడ ప్రతిపక్షాలన్నీ అదుపులో ఉంటాయి.
నిజానికి ఏ ఒక్క మూడవ పక్షం, ఏ ఒక్క ప్రత్యామ్నాయ అభిప్రాయమైనా ఆ మూసలోనే ఉండాలి.  అలా ఉండకపోతే నిర్దాక్షిణ్యంగా, కౄరంగా అణచివేస్తారు. అమెరికా అదుపుచేయడానికి ఎలా వేటాడుతుందో అసాంజె ఒక్కడే బహిర్గతం చేశాడు.
యూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందన్న కుట్ర సిద్ధాంతాన్ని సృష్టించినట్టుగానే, సాక్ష్యాలే లేకుండా ప్రజాభిప్రాయాన్ని 180 డిగ్రీలకు మార్చేయ గలుగుతుంది.
ఆ ప్రజలు ఊహాజనితమైన యూహాన్ ల్యాబ్ కథనాన్ని బలంగా నమ్మేశారు. అమెరికాలో ప్రజాభిప్రాయం ఏర్పడడానికి కచ్చితమైన సమాచారం ఉండదు. వారికున్న సమాచారమంతా తలకిందులుగా ఉంటుంది.
కరోనా వైరస్ ల్యాబ్ నుంచి రాలేదని ఏడాది క్రితం అమెరికాలో చాలా మంది ప్రజలు భావించారు.
అమెరికాలో ప్రజలిప్పుడు దానికి భిన్న మైన వాదనలను నమ్ముతున్నారు. అమెరికాలో ప్రసార మాధ్యమాలు ప్రజాభిప్రాయాన్ని ఆఫ్, ఆన్ స్విచ్ లాగా మార్చేయ గలుగుతాయి.
నేరపూరితమైన అశ్రద్ధవల్ల కోవిడ్-19 మహమ్మారిని అదుపు చేయలేక, నిరసన వ్యక్తం చేసే ప్రజలను లొంగదీసుకోవడానికి ఇలా చేస్తోంది.
గడిచిన 40 ఏళ్ళ నుంచి అభివృద్ధిలో చైనా దూసుకుపోతోంది. ఆకలి, అవినీతి, లాభాపేక్ష, నిరంకుశత్వంతో కూడిన పశ్చిమ దేశాల పాలనకు ఒక ప్రత్యామ్నాయ, సోషలిస్టు అభివృద్ధిని ప్రపంచానికి చూపించిన చైనా పై విస్తృతంగా దుష్ప్రచారం చేసింది.
చైనా మారణ హోమాన్ని సృష్టిస్తోందని, మానవ జాతి చరిత్రలో కనివిని ఎరుగని అన్యాయాలను చేస్తోందని ప్రచారం చేస్తోంది.ఇవ్వన్నీ ఆధారాలు లేని ఆరోపణలు.
ఒక నేరాన్ని ఊహిస్తుంటే, దానికి తగిన ఆధారాలను చూపించాలి. కానీ, పశ్చిమదేశాల ప్రసార మాధ్యమాలు దీనికి భిన్నంగా నమ్ముతుంటాయి. సాక్ష్యాలను బలహీనపరుస్తుంటాయి.
”యూగూర్ లో మారణమోహం’ ప్రచారవర్ణనలను తీసుకోండి.
ఇది తక్కువ సమాచారంతో, కొన్ని నమ్మకాలపై ఆధారపడింది. దీనికి తోడు సామాజిక మద్యమాలు కూడా అప్పుడప్పుడూ కంటతడి పెడతాయి.
అనుమానాలు, ప్రశ్నలు నివృత్తి అయినా పశ్చిమదేశాల ప్రసార మాధ్యమాల ప్రచారం కొనసాగుతూనే ఉంటుంది.
పశ్చిమదేశాల ప్రసార మాధ్యమాలలో అసత్యాల ప్రాతిపదికగానే చైనాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంటుంది.
ఈ రుణ ఉచ్చు దౌత్యం అంతా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోని బ్లింకెన్ కనుసన్నలలోనే జరుగుతుంది.
సుదీర్ఘమైన కుట్రసిద్ధాంత వేత్తగా ఇతనికి మహా చెడ్డ పేరుంది.చైనా తన సైనిక శక్తిని విపరీతంగా పెంచేస్తోందని ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు.
డెబ్బైదేశాలలో 800 మిలటరీ స్థావరాలను ఏర్పాటుచేసుకున్నది, చైనాకంటే రెండున్నర రెట్లు సైనిక బడ్జెట్ ఉందని బహిరంగంగా అదే ప్రకటించుకున్నది.
అవును, నిజమే. చైనా సైనిక విస్తరణ ప్రపంచ శాంతికి భంగకరం.
కాస్తకూడా నదురూ బెరుదూ లేని ఈ అబద్దాల ప్రచారానికి వివరణ ఏమిస్తారు?
ప్రజల మనసుల్లోకి నిత్యం చైనా వ్యతిరేక ప్రచారాన్ని దట్టించడాన్ని ఎలా వివరించగలుగుతారు?
ఈ ధోరణికి మూడు కారణాలున్నాయి.
జాతివివక్ష, ద్వేషం, హింస, ఇతర ప్రజల సంస్కృతుల పట్ల తిరస్కారభావం వంటి పశ్చిమ దేశాల విలువలు దీనికి ఒక కారణం.
విదేశీయులంటే అసాధారణ భయం(సినోఫోబిక్)తో కూడిన రిపోర్టింగ్, జాతి విద్వేషంతో కూడిన అవగాహన ద్వారా పశ్చిమ దేశాల ప్రచారం సాగుతోంది
సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడం మరొకటి.
సమస్యలన్నీ వలసవచ్చిన వారి వల్లేనని నమ్మబలకడం.
శత్రువులు అని చెప్పే వారిపైన దురాక్రమణ పై దృష్టిసారించడం.
అమెరికాలో వాతావరణ మార్పులనుంచి, ఎన్నికల వరకు ఏ నష్టం సంభవించినా విదేశీ హస్తం ఉందని చెప్పడం.
పశ్చిమ దేశాలలో కోవిడ్-19 విజృంభించినప్పుడు దానికి చైనానే బాధ్యత వహించాలని ఆరోపించారు.
వెనకటికి నాజీ జర్మనీలో ఏ సమస్య తలెత్తినా దానికి యూదులు, సోషలిస్టులు కారణమని ఆరోపించినట్టుగానే, ఇప్పటి అమెరికా సమస్యలన్నిటికీ చైనానే కారణమని ఆరోపిస్తున్నారు.
చైనా ఇప్పుడు ప్రత్యామ్నాయశక్తిగా, భవిష్యత్తుకు మరింతమానవీయ రూపంగా ఎదగడం వల్ల, విదేశీయులంటే అసాధారణ భయం ఉన్న ‘సినోఫోబియా’తో పశ్చిమదేశాల ప్రసార మాధ్యమాలు ప్రచారం చేస్తున్నాయి.
ప్రపంచంలో ఉన్న ప్రజలంతా తన ఆధీనంలో ఉన్నట్టు అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అదుపు చేయాలని చూస్తోంది.
ఎదుగుతున్న ఏజాతికైనా సరే అభివృద్ధి అనేది గౌరవమే కానీ, హక్కు కాదట.
ఆర్థికంగా కానీ, సైద్ధాంతికంగా కానీ ఆ హక్కు అనేది పశ్చిమదేశాలకు లోబడి ఉండాలట.
దానికి భిన్నంగా ఉండబట్టే చైనా ఇబ్బంది పడాలి.
ప్రచ్ఛన్న యుద్ధసమయంలో పశ్చిమదేశాలు అనేక ప్రచార యుద్ధాలను ప్రోత్సహించాయి.
ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో అలాంటి ప్రచారాల ప్రభావం పెద్దగా ఉండదు.
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ (సీఐఏ) ఆత్మసంతృప్తికి చేపట్టే ప్రచార ప్రభావం చాలామటుకు పశ్చిమదేశాలకు పరిమితమైంది.
యూగూర్ లో ప్రజలకు వ్యతిరేకంగా మారణ హోమం ఎక్కడ జరుగుతోందని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వారి సాధారణ జీవితం మూమూలుగా జరిగిపోతోందని అనేక వీడియోలు చెపుతున్నాయి.
అమెరికా పెట్టే ఇబ్బందులు ఇతర సామ్రాజ్యాల వలెనే దాని అతిశయోక్తులతో దెబ్బతినక తప్పదు.
( చైనా టీవీ గ్లోబల్ నెట్వర్క్ (cgtn)  సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *