ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు సాహిత్య పురస్కారం: గ్రంథాలకు ఆహ్వానం

 

ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం 2021 

అభ్యుదయ రచయితల సంఘం, వరంగల్లు శాఖ ప్రతి సంవత్సరం వేరువేరు సాహిత్య ప్రక్రియలకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు సాహిత్య పురస్కారం ప్రదానం చేయుట తెలిసినదే. 2021 సంవత్సరంనకు గాను విమర్శ ప్రక్రియకు ఇవ్వడానికి నిర్ణయించనైనది. కావున తెలుగు సాహిత్య విమర్శనా గ్రంథాలను పోటీ కి ఆహ్వానిస్తున్నాం
విమర్శ గ్రంథాలు జూలై 2017 నుండి జూన్ 2021 మధ్యలో ముద్రణ పొంది ఉండాలి. ప్రథమ ముద్రణ లు మాత్రమే పంపాలి.

వేరువేరు రచయితల వ్యాసాల సంకలనాలు పంపరాదు.
రచయితలు యే ప్రాంతం వారైనా పంపవచ్చు.
తప్పని సరిగా మూడు ప్రతులు పంపాలి.

తెలుగు సాహిత్య విమర్శనా గ్రంథాలు అందవలసిన చివరి తేదీ 30/09/2021.

పంపవలసిన చిరునామా;

బూర భిక్షపతి
ఇం. నెం.2 – 12 – 293/20
విజయ నగర్ కాలనీ
గోపాల్ పూర్ రోడ్డు
హన్మకొండ 506009
ఎంపికైన విమర్శ గ్రంథకర్త కు రూ5000/- నగదు, శాలువా, మెమెంటో లను నవంబర్ లో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో హన్మకొండ నందు అందజేయబడునని అ.ర.సం. వరంగల్లు శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిధి, డా. పల్లేరు వీరాస్వామి తెలిపారు.

వివరాలకు చరవాణి నం. 9701000306 , 9441602605,9866612717లలో సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *