ఫ్లిప్ కార్ట్ లో ఆంధ్రా ఫేమస్ శారీ బ్రాండ్స్, ఆప్కోతో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ కు ప్రఖ్యాత కాటన్, సిల్క్ చీరెలను మార్కెట్ చేసేందుకు ఆప్కో (APCO), ప్లిప్ కార్టు (flipkart) ఒప్పందం చేసుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్  కు చెందిన మంగళగిరి, వెంకటగిరి, చీరాల, ధర్మవరం, ఉప్పాడ, రాజమండ్రి తదితర ప్రాంతలకు చెందిన ప్రఖ్యాత కాటన్ , సిల్క్ చీరెలను ప్లిప్ కార్టు కస్టమర్లకు పరిచయం చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దీనితో ఆంధ్రప్రదేశ్ చెందిన సాంప్రదాయిక వస్తాలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తాయి.

కోవిడ్ పాండెమిక్ తో కుదేలయిన రాష్ట్ర చేనేత రంగానికి ఇది కొంత బాసటగా నిలుస్తుంది. పాండెమిక్ల చేనేత రంగం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. మార్కెట్ మూతపడటంతో ఈ చీరెలను కనేవాళ్లు కరరువయ్యారు. కర్ఫ్యూ వల్ల చేనేత మగ్గాలు పనిచేయడం మానేశాయి. కొనుగోలు దారులు మాయమ్యారు. ఇది లక్షలాది మంది చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది. దీన్నుంచి చేనత రంగానికి కొంతయిన ఉపశమనం కలిగించేందుకు ప్లిప్ కార్ట్, ఆప్కో ఒప్పందం దోహదపడుతుంది.

చేనేత రంగం మీద 7.50,000 మంది జీవనోపాధి పొందుతున్నారు. చేనేత వృత్తిలో ఉన్నవారికి ఆన్ లైన్ మార్కెటింగ్ వేదిక అందివ్వడమే కాకుండా, ఈ రంగానికి సంబంధించిన అనేక మెళకువల మీద  ప్లిఫ్ కార్ట్ శిక్షణ ఇస్తుంది. ఆరునెలల పాట జోరో కమిషన్ ను ఈ సేవలందిస్తుంది.

ఆప్కో (ఆంధ్ర  ప్రదేశ్ వీవర్స్  కోపరేటిటివ్ సొసైటీ లిమిటెడ్ ), ఫ్లిప్ కార్ట్ మధ్య గత ఏడాది ఈ ఒప్పందం కుదిరింది. ఫ్లిప్ కార్ట్ సమర్థ్ (Flipkart Samath)అనే కార్యక్రమం చేపట్టింది.  సమాజంలో అంతగా ప్రోత్సాహానికి నోచుకుని రంగాలకు చేయూత నిచ్చేందుకుఉద్దేశించిన ప్రోగ్రాం ఇది.  సమర్థ్ లో భాగంగానే ఆప్కో తో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ చేనేత రంగానికి ఒక మేలు జరుగుతుంది. ఆన్ లైన్ రిటైల్ కొనుగోలు దారుల అభిరుచిలేమిటో ఆప్కోకు తెలుస్తాయి. అపుడు చేనేత రంగం ఇపుడు నేస్తున్న వస్త్రాలను మార్కెట్ అనుకూలంగా మార్చవచ్చు. డిమాండ్ వున్న డిజైన్లను సృష్టించవచ్చు, ఇది చేనేత రంగం విస్తృతం చేసేందుకు దోహదపడుతుందని ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ రమేష్ బాబు తెలిపారు.

ఆంధ్ర సాంప్రదాయిక కాటన్, సిల్క చీరెలు కొని , చేనేత రంగానికి ప్రోత్సాహం అందించాలనుకుంటున్నారా? కింది లింక్ ను క్లిక్ చేయండి…
https://www.flipkart.com/clothing-and-accessories/~cs-bonawrkfsb/pr?sid=clo&collection-tab-name=Government_Emporium_Samarth_APCO.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *