(జి.నిరంజన్)
భారత దేశములో హైదరాబాద్ స్టేట్ విలీనం కాకుంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రము ఏర్పడేదా?
జూన్ 2 ననే తెలంగాణా కు విమోచన, స్వాతంత్య్రమంటూ 17 వ సెప్టెంబరున జరిగే విలీన దినోత్సవాన్ని విస్మరిస్తున్న కె.టి.ఆర్ కు సూటి ప్రశ్న.
కాంగ్రెస్ పాత్ర లేని హైదరాబాద్ విలీన పోరాటమూ లేదు. ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటమూ లేదు.
కెటిఆర్ వాస్తవాలను వక్రీకరిస్తే ప్రజలు నమ్మరు.
సెప్టెంబర్ 17 న టి.ఆర్.ఎస్ భవన్ లో జరిగిన హైదరాబాద్ విలీన దినోత్సవ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంటు కెటీఆర్ లు ఇరువురూ డుమ్మాకొట్టడమే కాకుండా తెలంగాణా ప్రజలకు జూన్ 2 యే నిజమైన విమోచన దినోత్సవమని, స్వాతంత్య్ర దినమని పేర్కొంటూ 17 సెప్టెంబర్ , తెలంగాణా విలీన దినోత్సవ దిన ప్రాముఖ్యతను కించపరుస్తూ మాట్లాడిన కెటిఆర్
తెలంగాణా ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి.
అసలు హైదరాబాద్ సంస్థానము ఆ రోజున భారత దేశములో విలీనం కాకుంటే తెలంగాణా ఉనికికే ప్రమాద మేర్పడేది కాదా? ప్రత్యేక తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు జరిగేదా? యని ప్రశ్నించారు.
కెటిఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. కొన్ని రోజులైతే ఇంకా పిచ్చి నెత్తి కెక్కి అసలు భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూడా గుర్తించకుండా పోతారేమో అనే అనుమానము కలుగుతుంది.
అసలు ఈ దినానికి ప్రాముఖ్యతనే లేకుంటే, అధికార పూర్వకంగా నిర్వయించాలని కెసిఆర్ గతములో ఎందుకు డిమాండ్ చేశారు ?
హైదరాబాద్ స్టేట్ విలీన పోరాటములో ప్రధాన పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకుల పేర్లు చెబితే తమ ప్రాభవము ఎక్కడ మసక బారుతదోనని కెటిఆర్ సంకుచితముగా మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ పాత్ర లేని హైదరాబాద్ విలీన పోరాటము లేదని గమనించాలి..
విలీన ఉద్యమ పోరాటములో తమ పాత్ర లేని బిజెపి టిఅర్ఎస్ పార్టీలలో ఒక పార్టీ మతతత్వ ధోరణితో పబ్బము గడుపుకోవాలని ప్రయత్నిస్తుంటే మరొక పార్టీ తమ డొల్లతనము బయట పడుతుందనే భయముతో అసలు విలీన దినోత్సవానికే గుర్తింపు లేకుండా ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తుంది.
టీఆర్ఎస్ పార్టీ దుర్బుద్ధిని గ్రహించిన తెలంగాణా ప్రజలు టి.అర్ ఎస్ పార్టీకి తగిన బుద్ది చెప్తారు.
(జి.నిరంజన్, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు)