తిరుమల తిరుపతి దేవస్థానానికి 81 మంది సభ్యుల పాలకమండలి ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి నేడు గవర్నర్ హరిచందన్ ను కలసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో గవర్నర్ బిజెపి నేతలు ఈ రోజు గవర్నర్ ను కలిశారు.
ఈ సందర్బంగా సోమూ వీర్రాజు కామెంట్స్:
25 మంది బోర్డు సభ్యులని నియమించినట్టు టీటీడీ మొదట ప్రకటించింది. ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో అదనంగా 50 మంది పేర్లు చేర్చి కమిటీ వేసింది. జంబో టీటీడీ పాలకమండలిని వ్యతిరేకిస్తున్నాం,ఇది సరైన పద్ధతికాదు. వైసీపీ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధనాలను బిజెపీ అంగీకరించదు, వీటిని అడ్డుకుంటాం. ప్రత్యేక ఆహ్వానితులకు కూడా సభ్యులతో సమానమైన ఏర్పాటు భక్తులకు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రభుత్వాన్ని పిలిచి ఈ విషయాన్ని చర్చించాలని గవర్నర్ ను కోరాం, ఆయన సానుకూలంగా స్పందించారు.
ప్రభుత్వ హిందూ వ్యతిరేక ఆలోచనా ధోరణికి అడ్డుకట్ట వేసే మార్గాలను మేము ఆలోచిస్తున్నాం. కొంతమంది క్రిమినల్స్ పేర్లు టిటిడి బోర్డులో ఉంచడాన్ని బిజెపి వ్యతిరేకిస్తోంది.
గవర్నర్ ను కలిసిన వారిలో రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు , ఒబిసి మోర్చా రాష్ట్రఅధ్యక్షుడు బిట్ర శివన్నారాయణ ,మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ఉన్నారు.