మంగళగిరి సీనియర్ జర్నలిస్ట్,కవి, రచయిత చెన్నా అజయ్ కుమార్ కుటుంబానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.
విశాలాంధ్ర విలేకరిగా పనిచేస్తున్న చెన్నా అజయ్ కుమార్ రెండు రోజుల కిందట అనారోగ్యంతో మరణించిన సంగతతెలిసిందే.
అంత్య క్రియలసమయంలో జర్నలిస్టుకు నివాళి చెబుతూ అజయ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.
ఈ రోజు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆయన రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ కుమార్ మృతి బాధాకరమని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. నివేశన స్థలం మంజూరు చేసి గృహ నిర్మాణాన్ని చేయిస్తామని కూడా అన్నారు. అజయ్ కుమార్తెకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే ఆర్.కే. హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష , కార్యదర్శులు ఐ. వెంకటేశ్వరెడ్డి, బి. దయాకర్, జర్నలిస్టులు వి. బ్రహ్మానాయుడు, ఎం. సిరిబాబు, ఎం. కృష్ణ, బి. సాంబశివరావు, ఎస్.కే సుభానీ, అభిరామ్ కృష్ణారెడ్డి, డి. రాము, వి.రాంబాబు, జీవై సాయికృష్ణ, శ్రీకాంత్,మధు, సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/tribute-mangalagiri-journalist-chenna-ajaykumar/