6 నెలల ఆకాశ యాత్ర శిక్షణలో తెలంగాణ రాజాచారి

ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి నాసా యాస్ట్రొనట్ తెలంగాణ మహబూబ్ నగర్ కు చెందిన  రాజా చారి. స్పెేస్ ఎక్స్ క్రూ-3 (SpaceX Crew-3) కమాండర్ గా ఆయన ఎంపికయిన సంగతి తెలిసిందే. ఇపుడాయన స్పెస్ ఎక్స్ క్రూ డ్రాగన్ (SpaceX Crew Dragon)  లో శిక్షణ పొందుతున్నాడు. క్రూ-3 అనేది  నాసా కమర్షియల్ ప్రోగ్రాం.  స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అనేది నాసా అంతరిక్ష పరిశోధకులను ఇంటర్నేషనల్ స్పేష్ సెంటర్ కు తీసుకుపోయే వాహనం. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్, ఫాల్కన్ 9 రాకెట్ లను అక్టోబర్ 31 న ప్రయోగించాలని తాత్కాలికంగా నాసా అధికారులు నిర్ణయించారు. ఫ్లారిడా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.

ఈ ఫోటోని స్పేస్ ఎక్స్ నిన్న విడుదల చేసింది.

ఈ యాత్రలో ముగ్గురు  అమెరికా అంతరిక్ష పరిశోదకులు పాల్గొంటున్నారు.ఇందులో చారి మిషన్ కమాండర్. మరొకరు పైటల్ టామ్ మార్ష్ బర్న్, మూడో వ్యక్తి మిషన్ స్పెషలిస్టు కేలా బ్యార్రాన్. వీళ్లతో పాటు యూరోపియన్ స్పేస్ సెంటర్ కు చెందిన  మిషన్ స్పెషలిస్టు మాథియాస్ మారర్ కూడా ఉంటారు. వీళ్లది దీర్ఘకాలిక యాత్ర. భూమి లోకక్ష్య లోని మైక్రోగ్రావిటీలో ఈ బృందం ఆరు నెలల పాటు రకరకాల సైన్స్ పరిశోధనల జరుపుతుంది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/raja-chari-telugu-origins-spacex-crew-caommander-iss/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *