గెస్ట్ లెక్చరర్ ఉద్యోగమంటే ఉరితాడేనా?

గెస్టు లెక్చరర్ కాసోజు గణేషాచారి మూడు రోజులు కిందట ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక జూనియర్ కాలేజీలో బాటనీ బోధిస్తారు. ఒక విధంగా చెబితే కాలేజీలెక్చరర్. కాలేజీలో ఉద్యోగమంటే చీకుచింతాలేని ఉద్యోగం. మంచి జీతం, సెలవులు ఎక్కువ అనుకుంటారు. అక్కడే తిరకాసు.

ఆయనపేరుకే లెక్చరర్ గాని, గెస్టు లెక్చరర్. ఏ మాత్రం గౌరవమర్యాదలు లేని కాలేజీ గెస్టు. అదొక కూలీ పని. గంటకు కొంత డబ్బిస్తారు. రోజుకు మూడు గంటలు పనిచేయాలి. నెలకు పదిరోజులకుమించి ఉండదు. ఇలాంటి దుర్మార్గమయిన ఉద్యోగం మరొకటుండదు. రెగ్యులర్ జీతాలుండవు. ఇలాంటి గెస్టు లెక్చరర్ల జీవితాలను కరోనా కకావికలం చేసింది. తెలంగాణ ప్రభుత్వంలో ఇక ఉపాధి  దొరకదని నిరాశ పడిపోయి, గణేషాచారి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆయన కుటుంటాన్ని టిజెఎస్ నేత ప్రొఫెపర్  కోదండరాం ఈ రోజు పరామర్శించారు ఆయన వెంబడి, సదానందం గౌడు ,పలువురు గెస్టు లెక్చరర్స్ , ప్రజాసంఘాలు కూడాఉన్నాయి  కాసోజు కుటుంబానికి  కోదండరామ్ 10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటికైనా గెస్టు లెక్చరర్స్ ని రినివల్ చేసి ,16 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గణేష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కాసోజు గణేష్ (29) నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బాటనీ  గెస్ట్ లెక్చరర్ గా ఉండేవారు. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో కాలేజీలు ప్రారంభమయ్యాయి. గెస్టు లెక్చరర్లని మాత్రం విధుల్లోకి తీసుకలేదు. వాళ్ల పునర్నియామకం మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనలేదు. దీనితో ఉపాధి గ్యారంటీ లేక, పాత జీతాలు రాక అయోయంలో పడ్డ గణేషాచారి ఆత్మహత్య చేసుకున్నారు.

తెలంగాణ నిరుద్యోగం పరిస్థితి గెస్ట్ లెక్చరర్ ఒక ఉదాహరణ. రెగ్యులర్ లెక్చరర్లను నియమించకుండా తక్కవ జీతాలతో    ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో నియమించే అధ్యాపకులే గెస్లు లెక్చరర్లు, రకరకాల బంధు పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం కళాశాలలో  ఖాళీలున్న చోట్ల తాత్కాలిక ప్రాతిపదికన ఇలా గెస్ట్‌ లెక్చరర్లను నియమించడమేమిటి?

గెస్టు లెక్చరర్లకు  రోజూ కనీసం మూడు తరగతులు ఉండేలా చూస్తారు.  ఒక్కో తరగతికి బోధించినందుకు రూ.300 చొప్పున రోజుకు రూ.900 చొప్పున చెల్లిస్తారు. ఈలెక్కన వారికి  కనీసం రు. 25 వేలు రావచ్చు అని అనుకుంటారు. అక్కడు తిరకాసు. వారికి  నెలలో పని దినాలకు మాత్రమే వేతనాలు చెల్లిస్తారు.  ఉదాహరణకు 2020కి ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గెస్టు లెక్చరర్ ప్రాతిపదికన 54 కాలేజీల్లో 241 మంది గెస్ట్‌ లెక్చరర్లు ఉండేవారు.  కరోనారావడంతో కళాశాలు మూతపడ్డాయి. గెస్టు లెక్చరర్లంతా ఉపాధి కోల్పోయారు. దాదాపు ఏడాదిన్నరగా వీరెవరికీ క్లాసులు లేవు.అంటే కూలీ లేదు. దానికితో వీళ్లకి రెగ్యులర్ గా జీతాలు రావు. కరోనా కర్ఫ్యూ వచ్చి కళాశాలు మూసేసే నాటికి వీరికి ప్రభుత్వం మూడునెలల బకాయీ ఉంది. ఈ వేతనాలను కూడా ఇప్పటి వరకుచెల్లించలేదు.పాత వేతనాలు అందలేదు. కొత్త వేతలనాలు లేవు.

దీనితో ఈ కుటుంబాలన్నీ ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. అప్పులపాలయ్యాయి.  ప్రైవేట్‌ టీచర్లకు అందిస్తున్నట్లుగా వారిరి నెలకు రెండు వేల రుపాయల పారితోషికం,   25 కేజీల  బియ్యం వారికి అందడం లేదు.

One thought on “గెస్ట్ లెక్చరర్ ఉద్యోగమంటే ఉరితాడేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *