‘టీఆరెస్ కు ప్రత్యామ్నాయం వచ్చేసింది’

(బండి సంజయ్ కుమార్)

 

• పాదయాత్రకు వస్తున్న జనంతో కేసీఆర్ వణికిపోతుండు. బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లు ఇస్తుంటే తట్టుకోలేక అధికారులను సస్పెండ్ చేయడం మొదలుపెట్టిండు. ప్రజల్లో అయోమయం స్రుష్టించేందుకు బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటేనని దుష్రచారం చేస్తుండు. ఏనాడూ బీజేపీ-టీఆర్ఎస్ కలిసి పోటీచేయలేదు? కలిసి పోటీ చేసిన చరిత్ర టీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం-టీడీపీ పార్టీలదే. రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రత్యామ్నాయమని భావనకు వచ్చేశారు.

• వరి వేస్తే ఉరి వేసినట్లేనని సీఎం చెప్పాక 5 గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. సీఎం మాటలు తట్టుకోలేక తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. సీఎం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.

• వర్షాలతో తెలంగాణలో పంటలు ఎక్కువ పండుతున్నయ్. ఆ పంటను కొనడం చేతగాని సీఎం ఆ నెపాన్ని కేంద్రంపై మోపాలని చూస్తుండు. కేసీఆర్…కష్టాల్లో ఉన్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? కేంద్రం ఇస్తున్న నిధులను రైతులకు ఎందుకు అందించడం లేదు? ఫసల్ బీమా ఎందుకు అమలు చేయడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలి.

• మెతుకు సీమ దారణమైన పరిస్థితిలో ఉంది. ఉద్యోగాల్లేక యువత అల్లాడుతోంది. రైతులు అల్లాడుతున్నరు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని అంటున్నడే తప్ప ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఒక్క డబుల్ బెడ్రూం కట్టివ్వలేదు. కేంద్రం 3 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టివ్వకుండా ప్రజలను మోసం చేస్తోంది. ఇక్కడ ఇంటికో ఉద్యోగం ఎంతమందికి వచ్చింది? నిరుద్యోగ భ్రుతి ఎంతమందికి వచ్చింది? ఈ జిల్లాలోని ప్రజా ప్రతినిధులారా……కేంద్రం మంజూరు చేసిన ఇండ్లను మీ నియోజకవర్గంలో, జిల్లాలో ఎన్ని ఇచ్చారో స్పష్టం చేయాలి. కేసీఆర్ ను గల్లా పట్టి నిలదీయాలి. ఈ జిల్లాలో ఎంతమందికి నిరుద్యోగ భ్రుతి ఇచ్చారు? ఎంతమందికి 3 ఎకరాల పొలం ఇచ్చిండ్రో స్పష్టం చేయాలి.

• జీతాలివ్వడానికే డబ్బుల్లేని ప్రభుత్వం దళిత బంధు ఇస్తానని ఆశ చూపుతూ మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తుండు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిండు. ఒక్కో తలపై రూ.లక్షకుపైగా అప్పు భారం మోపిండు.

• మోదీ ప్రభుత్వం తన కేబినెట్ లో 27 మంది బీసీలను, 12 మంది ఎస్సీలను, 8 ఎస్టీలను, 12 మంది మహిళలను, 6గురు మైనారిటీలను మంత్రులుగా చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ. ఈరోజు బియ్యంసహా అన్నీ ఇచ్చేది కేంద్రమే. ఫ్రీ బియ్యం ఇస్తున్న ఘనత బీజేపీదే. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి కేసీఆర్. ఫ్రీవ్యాక్సిన్ మేం ఇస్తుంటే కనీసం మోదీ పేరు కూడా ప్రస్తావించేందుకు నోరు రాని సిగ్గులేని సీఎం కేసీఆర్.

• కోవిడ్ వస్తే జనం అల్లాడిపోయిండ్రు. అందరూ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ కు సహకరించిండ్రు. కానీ బీజేపీ నాయకులు మోదీ పిలుపుతో ప్రజలకు సేవ చేసినం. పీపీఈ కిట్లు ఇచ్చినం…మందులుసహా చివరకు చెప్పులు కూడా ఇచ్చినం. మీకు సేవ చేసే క్రమంలో 8 మంది కార్యకర్తలు చనిపోయిండ్రు. 12 మంది జిల్లా అధ్యక్షులు కోవిడ్ పాలైండ్రు. కానీ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ఇంటికే పరిమితమైండ్రు. కానీ బీజేపీకి ఈ సమాజం ముఖ్యం. పేదలను కాపాడాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది కాబట్టే ప్రాణాలకు తెగించి సేవ చేసినం. ప్రజల కోసం లాఠీదెబ్బలు తిన్నం. నిరుద్యోగుల కోసం రోజూ ఉద్యమాలు చేస్తున్న యువ మోర్చా అధ్యక్షుడిని రోజుకో కేసు పెడితే ఇబ్బంది పెడుతున్నరు.

• మీకోసం కొట్లాడే పార్టీ బీజేపీ. మీ కోసం లాఠీదెబ్బలు తినే పార్టీ బీజేపీ. హైదరాబాద్, వరంగల్ లో వరదలొస్తే ఈ సీఎం రాలేదు. ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం రాలేదు. ఆర్టీసీ కార్మికులు చచ్చినా వెళ్లడు. పేద్దోళ్లు చనిపోతే మాత్రం వెళ్లి బోకేలు పెట్టి సంతాపం చెబుతాడు. కానీ బాధితును, పేదల వద్దకు వెళ్లి భరోసా స్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. ఈ మూర్ఖుడి పాలనలో జరిగిన నిర్లక్ష్యంవల్ల ఇంటర్మీడియట్ప పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. కొన ఊపిరితో కొట్లాడుతూ సిరిసిల్ల ఇంటర్ విద్యార్థిని నాకు బతకాలని ఉంది. కాపాడండీ…అంటూ ఏడుస్తుంటే చూడలేని సన్నివేశం. చివరకు వైద్యం అందక ప్రాణాలు కోల్పొయిన దుస్థితి.

 

( మెదక్ ప్రజా సంగ్రామ యాత్ర లో  బండి సంజయ్ కుమార్ ప్రసంగం పూర్తి పాఠం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *