‘నిరసన కవి’ అత్తలూరి నరసింహారావు మృతి

ప్రముఖ రచయిత  అత్తలూరి నరసింహారావు ఈ తెల్లవారుజామున విశాఖలో మృతి చెందారు. ఒకనాటినిరసన కవులు అని పిలువబడే ఒక వర్గంలో ఆయన ఒకరు. అబ్బూరి గోపాలకృష్ణ, భైరవయ్య, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ తక్కిన నిరసన కవులు. వీరు విప్లవ రచయితల సంఘం కు వ్యతిరేకంగా కవిత్వం చెప్పేవారు.

అత్తలూరి నరసింహారావు 1946లో జన్మించాడు. వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశాడు.  విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన రాసిన నిద్ర అనే కథకు కరీంనగర్ నుండి వెలువడే విద్యుల్లత అనే పత్రిక నిర్వహించిన కథలపోటీలో మొదటి బహుమతి వచ్చింది.

అయ్యన భార్య టి.పద్మిని సంగీత విద్యాంసురాలు. ఆమె వీణావాదనంలో విశాఖపట్నం ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో ఎ గ్రేడ్ కళాకారిణి. ఆమె 2019, ఫిబ్రవరి 19న మరణించింది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

ఆయన రచననలు

త్రిపుర ఓ జ్ఞాపకం సంపాదకత్వం – (భమిడిపాటి జగన్నాథరావు, కె.కె.రామయ్యలతో కలిసి)
చలంగారి ఉత్తరాలు 1947-1977
స్వరాజ్యం స్వేచ్ఛానువాదం – మూలం: అరవింద్ కేజ్రీవాల్
రావిశాఖీయం
సాహిత్యరంగంలో ప్రతిభామూర్తులు
నేనెందుకు వ్రాస్తున్నాను?
నాకూ ఉంది ఒక కల అనువాదం – తుమ్మల పద్మినితో కలిసి.

కథలు
ఇంకానా.
దారి
వీడ్కోలు
నిద్ర
అతను ఆమె అందరము
రాళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *