ఆంధ్రప్రదేశ్ రైతుల సగటు రుణభారంలో దేశంలో నెంబర్ వన్ అయ్యాడు. సగటును కుటుంబ రుణభారం రు. 2 లక్షలకు మించి ఉన్న రాష్ట్రాలలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆశించినంతగా బ్యాంకులనుంచి రుణాలు అందడలేదు. ఈ విషయంలో జాతీయ సగటు కంటే ఆంధ్ర ప్రదేశ్ బాగా కింద ఉంది. అందువల్ల ఆంధ్రా రైతులు తన వ్యవసాయ, కుటుంబాావసరాలు తీర్చుకునేందుకు వడ్డీ వ్యాపారుల మీద అధార పడాల్సి వస్తున్నది. ఇది బ్యాంకు వడ్డీకంటే ఎక్కువగా ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు
ఈ విచారకరమయిన విషయాలు భారతప్రభుత్వ సంస్థ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) వెల్లడించింది.
వివరాలు
భారతదేశంలో రైతులో అప్పుల వూబిలో కూరుకుపోతున్నాడు. 2018 నాటికి ఒక్కొక్క రైతు కుటుంబం మీద అప్పు రు.74,121 రుపాలయకు చింది. నేషనల్ స్టాటిటిక్స్ ఆఫీస్ తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్ సమాచారం ప్రకారం అంతకు ముందు అయిదేళ్ల కంటే ఇది 57 శాతం ఎక్కువ. అంటే రైతు మీద రుణ భారం పెరుగుతూనే ఉందన్నమాట. 2013 లో రైతు కుటుంబం మీద ఉన్న అప్పుల భారం కేవలం రు. 47,000 మాత్రమే. ఈ సర్వే ఫలితాలను Situation Assessemtn of Agricultural House Hold and Land Holdings of Households in Rural India అనే పేరుతో విడదలు చేసింది.
అయితే, ఈ మధ్యకాలంలో రైతుల నెలసరి ఆదాయం 59 శాతం పెరిగిందని NSO నివేదికను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది. 2012-13 లో నెలసరి ఆదాయం రు. 6,426 ఉంటే 2018-19 నాటికి ఇది 10,218రుపాయలకు పెరిగింది. అయితే, వ్యవసాయంలో కూలీరేట్లు పెరిగినందున వచ్చిన ప్రయోజనమమని, ఈ మధ్య కాలంలో కూలీ రేట్లు రు. 2071(2013) నుంచి రు.4,063 (2018)కి పెరిగినట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఆదాయం పెరిగినట్లు పెయిడ్ ఔట్ (paid out expenses)పద్ధతిలో గణించారు. పెయిడ్ ఔట్ ఎక్స్ పెన్సెస్ అంటే, అన్ని రకాల ఇన్ పుట్స్ మీద రైతు తన జేబునుంచి పెట్టే ఖర్చు అని అర్థం.
భారతదేశంలో 2018 డిసెంబర్ నాటికి 4.67 కోట్ల రైతు కుటుంబాల మీద రుణభారం ఉందని గుర్తించింది. అయితే, 2013 నాటి లెక్కలతో పోలిస్తే లక్ష కుటుంబాలు తక్కువ. భారత దేశంలో మొత్తంగా 9.30 కోట్ల వ్యవసాయ కుటుంబాలున్నాయి.
ఈ సర్వేని 2018లో జూలై-డిసెంబర్ మధ్య, 2019లో జనవరి – జూన్ మధ్య రెండు దఫాలుగా చేశారు.
ఈ సర్వే ప్రకారం రైతు కుటుంబం అంటే కుటుంబాదాయంలో రు. 4000వేలు వ్యవసాయోత్పత్తుల నుంచి రావాలి. అదే విధంగా కుటుంబ సభ్యుల్లో ఒకరు గత 365 రోజులో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా లేదా ఉప వృత్తిగా కలిగి ఉండాలి.
An agricultural household is defined as one receiving more than Rs 4,000 as value of produce from agricultural activities (cultivation of field crops, horticultural crops, fodder crops, plantation, animal husbandry, poultry, fishery, piggery, bee-keeping, vermiculture, sericulture, etc) and that has at least one member self-employed in agriculture (either in principal or in subsidiary status) in the last 365 days
అప్పుల ఊబిలో చిక్కుకున్న సగటు కుటుంబాల సంఖ్య 51.9% నుంచి 50.2%కి తగ్గినా, సగటు రుణ భారం మాత్రం పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 93.2% రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ తెలుగు రాష్ట్రంలో ఒక్కో కుటుంబం మీద సగటున రూ.2,45,554 రుణ భారం ఉన్నట్లు ఈసర్వే వెల్లడించింది.
ఇక తెలంగాణలో 91.7% రైతు కుటుంబాలు అప్పుల వూబిలో కూరుకుపోయి ఉన్నాయని, ఒక్కో కుటుంబంపై రూ.1,52,113 అప్పు ఉందని NSO చెప్పింది.
రైతు కుటుంబంపై అత్యధిక రుణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రెండులక్షల రుపాయలకంటే ఎక్కువ రుణభారం ఉన్న మూడు రాష్ట్రాలో ఆంధ్రప్రదేశ్ మొదటిది ఇక్కడ కుటుంబ సగటు రుణ భారం రూ.2,45,554. తర్వాతి స్థానాల్లో కేరళ (రూ.2,42,482), పంజాబ్ (రూ.2,03,249) ఉన్నాయి.
లక్షకంటే ఎక్కువ రుణా భారం ఉన్న 5 రాష్ట్రాలో తెలంగాణ ఉంది. ఇందులో హర్యానా (రు. 1.82 లక్షలు), తెలంగాణ (రు.1.52 లక్షలు), కర్నాటక ( రు. 1.26లక్షలు), రాజస్థాన్(రు. 1.13 లక్షలు), తమిళనాడు (రు. 1.06లక్షలు). 2013 -2018 మధ్య రైతుకుటుంబాల మీద రుణ భారం 13.52 శాతం నుంచి 709 శాతం దాకా పెరిగిందని సర్వేలో తేలింది. తమిళనాడు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో రుణభారం తగ్గింది
జాతీయ స్థాయిలో బ్యాంకుల నుంచి అందే రుణాలు 69.6% రైతు కుటుంబాలకు అందుతుండగా, ఆంధ్రలో 49.6%, తెలంగాణలో 42.5% మందికే అందుతున్నాయి. దానివల్ల రైతులు తమ వ్యవసాయ అవసరాలకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకతప్పలేదు ఆంధ్రప్రదేశ్ రైతులలో 31.1% మందికి వడ్డీ వ్యాపారస్థులే దిక్కు
తెలంగాణలో వ్యవసాయ వడ్డీ వ్యాపారులనుంచి 9.1% మంది రుణం తీసుకోగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి 41.3% మంది రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి దేశంలో సగటున 44.5% కుటుంబాలకు రుణాలు అందుతుండగా, ఏపీలో అది 34.1%, తెలంగాణలో 24.8%కే పరిమితమైంది. జాతీయ స్థాయిలో వ్యవసాయం కోసం తీసుకుంటున్న రుణాల్లో కేవలం 57.5% మొత్తమే వ్యవసాయం మీద వెచ్చిస్తున్నారు. మిగతా మొత్తం ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు.